Shilpa Shetty : మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ స్టార్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలకు భారీ ఊరట లభించింది. ముంబైలోని జుహు ప్రాంతంలోని ఇల్లు, పావ్నా సరస్సు సమీపంలోని ఫామ్‌హౌస్‌ను ఖాళీ చేయాలని ఈడీ పంపిన నోటీసులపై బాంబే హైకోర్టు స్టే విధించింది. 2017లో రాజ్ కుంద్రా సంస్థ బిట్‌కాయిన్‌ల రూపంలో దాదాపు రూ. 6,600 కోట్లు వసూలు చేసిందని ఆరోపణలు వచ్చాయి. నెలకు 10 శాతం రిటర్న్‌లు ఇస్తామని చెప్పి ఇన్వెస్టర్లను మోసం చేశారని కేసు నమోదైంది. ఈ పథకం సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి రాజ్ కుంద్రా దాదాపు 285 బిట్ కాయిన్లు తీసుకున్నట్లు సమాచారం.
Read Also:PM Modi: ఇది యుద్ధాల యుగం కాదు.. దౌత్యానికి ప్రాధాన్యమివ్వాలి..!
శిల్పాశెట్టి, రాజ్‌కుంద్రాలకు చెందిన రూ.98 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు. ఆ బిట్‌కాయిన్‌లతో ఉక్రెయిన్‌లోని మైనింగ్ ఫామ్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలకు చెందిన రూ.98 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ముంబైలోని జుహూలో శిల్పాశెట్టి పేరిట ఉన్న బంగ్లా, పూణేలోని ఫ్లాట్, కుంద్రా పేరిట ఉన్న ఈక్విటీ షేర్లను సీజ్ చేసినట్లు ఈడీ తెలిపింది. వీటి మొత్తం విలువ రూ.97.79 కోట్లు. ఈ నేపథ్యంలోనే గత నెల 27న భవనాలను ఖాళీ చేయాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈడీ నోటీసులకు వ్యతిరేకంగా శిల్పాశెట్టి దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు ఈడీ నోటీసులపై స్టే విధించింది.
Read Also:Ponguleti Srinivas Reddy: మాటలతో కాదు.. చేతలతో చూపించేది ఇందిరమ్మ ప్రభుత్వం..