NTV Telugu Site icon

Fake Call : స్కూళ్లో బాంబ్ పెట్టాం.. ఏ క్షణంలోనైనా పేలొచ్చు

Delhi School

Delhi School

Fake Call : ఢిల్లీలో ఓ స్కూల్‎ పేరు మీద మొయిల్‎తో రావడంతో అధికారులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. హడావుడిగా ఎక్కడికక్కడా సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఏ చిన్న ప్రాంతాన్ని వదలకుండా అణువణువు తనిఖీ చేసి ఏం లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే.. ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ప్రాంతంలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. ఇ-మెయిల్ ద్వారా మీ స్కూళ్లో బాంబు పెట్టాం ఏ క్షణంలోనైనా పేల్చేస్తామని అందులో ఉంది. బాంబు బెదిరింపులు రావడంతో భయాందోళనకు గురైన స్కూల్ యాజమాన్యం పాఠశాలను ఖాళీ చేయించింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించింది.

Read Also: Work 4Days a Week : ఉద్యోగుల పంటపండింది.. ఇక వారానికి 4రోజులే పని

దీంతో అప్రమత్తమైన అధికారులు పాఠశాలలో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించారు. ఆ స్కూల్లో ప్రతిమూల వెతికి ఎలాంటి బాంబును దొరక్క పోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఇదంతా ఆకతాయిల పనిగా పోలీసులు భావిస్తున్నారు. బీఆర్‌టీ మార్గ్‌లోని సాదిక్ నగర్‌లో ఉన్న పాఠశాల అధికారిక ఈ-మెయిల్ ఐడీకి పాఠశాల ఆవరణలో బాంబు పెట్టినట్లు మధ్యాహ్నం 1.19 గంటలకు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో స్కూల్ యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే విద్యార్థులను ఖాళీ చేయించారు. సైబర్ బృందం ఇ-మెయిల్ చెక్‌ చేసిందని, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పాటు డిఫెన్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నుంచి బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని బాంబు కోసం గాలించాయి. ఎలాంటి బాంబు దొరక్క పోవడంతో ఆకతాయిల పనై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు ప్రకటించారు.