Site icon NTV Telugu

Bomb Threat: రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు

Indigo

Indigo

Bomb Threat: సోమవారం ముంబై నుంచి జెడ్డా, మస్కట్‌లకు వెళ్తున్న రెండు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రెండు విమానాలను దూరంగా ఉన్న ‘బే’కు తీసుకెళ్లారు. ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను అనుసరించి అవసరమైన అన్ని పరిశోధనలు చేస్తున్నారు. 6E 1275 విమానం ముంబై నుంచి మస్కట్ వెళ్తోంది. మరో ఇండిగో విమానం 6E 56 ముంబై నుంచి జెడ్డాకు వెళ్తోంది. ఈ తెల్లవారుజామున ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఎయిరిండియా విమానం బయలుదేరగా, వెంటనే ట్వీట్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఎయిరిండియా విమానాన్ని వెంటనే ఢిల్లీకి మళ్లించారు.

Jharkhand: జార్ఖండ్‌లో దారుణం.. దుర్గాపూజకు వెళ్లి వస్తున్న ఇద్దరు దళిత బాలికలపై సామూహిక అత్యాచారం..

దీని తర్వాత, అక్టోబర్ 14న ముంబై నుంచి జేఎఫ్‌కేకి వెళ్లిన ఎయిరిండియా 119 విమానానికి ప్రత్యేక భద్రతా హెచ్చరిక అందిందని, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఢిల్లీ వైపు మళ్లించామని ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. దీనితో విమానంలోని ప్రయాణికులందరూ దిగి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌లో వేచి ఉన్నారు. ఈ ఘటనలో ఏ ప్రయాణీకుడికి ఎలాంటి నష్టం జరగకపోవడం ఊరటనిచ్చే అంశం.

Heavy Rains Latest Weather Report: ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం.. లేటెస్ట్‌ రిపోర్ట్..

Exit mobile version