స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ.. బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో పలుచోట్ల బాంబులు పెట్టినట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే చర్యలు తీసుకుంటూ అలర్ట్ అయ్యారు. నగరంలోని శ్రమ శక్తి భవన్, కాశ్మీర్ గేట్, ఎర్రకోట, సరితా విహార్ లో గుర్తు తెలియని బ్యాగులను ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీస్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. శ్రమశక్తి భవన్ సమీపంలో అమర్చిన బ్యాగులో ఏమీ కనిపించలేదని అధికారులు తెలిపారు. ఆ బ్యాగ్ అక్కడే ఉండే ఓ ఎలక్ట్రిషియన్ కు చెందినదిగా గుర్తించారు.
Read Also: Nora Fatehi : ఉప్పొంగే పరువాలతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ..
మరోవైపు ఎర్రకోట, కాశ్మీర్ గేట్, సరితా విహార్ లోని ప్రాంతాల్లో ఉన్న బ్యాగులను సైతం అధికారులు పరీక్షించి చూడగా.. ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా.. స్వాతంత్ర్య వేడుకల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం చేశారు. ఏదేమైనప్పటికీ.. ఈ బాంబులకు సంబంధించిన సమాచారం పోలీసు శాఖలో కలకలం రేపింది. రంగంలోని దిగిన ప్రత్యేక అధికారులు, విచారణ జరిపిన కొద్దిసేపటి తర్వాత అవన్నీ బోగస్ కాల్స్ గా పేర్కొన్నారు. విచారణలో అనుమానాస్పదంగా ఏమీ తేలకపోవడంతో శ్రమశక్తి భవన్ సమీపంలో పోలీసులు ట్రాఫిక్ ను ఆంక్షలను తొలగించారు.
Read Also: TTD Key Decisions: టీటీడీ హైలెవల్ కమిటీ కీలక నిర్ణయాలు.. నడకదారిలో ఇకపై ఇవి కుదరదు..
కాగా, దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలోని అనేక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నిఘా సంస్థలతో పాటు వివిధ కేంద్ర బలగాలు సైతం అప్రమత్తంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు రేపు ఎర్రకోటపై ప్రధాని మోడీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా.. పలువురు నేతలు, అధికారులు పాల్గొననున్నారు.