దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో వరుసగా ఈ మెయిల్ బెదిరింపు కాల్స్ రావడం అధికారుల్ని పరుగులు పెట్టిస్తోంది. మరోవైపు ప్రజలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం కేంద్ర హోంశాఖకు బెదిరింపు కాల్ రాగా.. అది వట్టిదిగా పోలీసులు తేల్చారు. ఇక గురువారం కూడా బెంగళూరులోని ప్రముఖ హోటళ్లకు బెదిరింపు కాల్స్ రాగా.. అలాగే ఢిల్లీలోని పలు కాలేజీలకు కూడా బెదిరింపులు వచ్చాయి.
ఇది కూడా చదవండి: BSF Jawan: ఇసుకలో పాపడ్ కాల్చిన జవాన్..వీడియో వైరల్
ఢిల్లీలోని మహిళా శ్రీరామ్, వెంకటేశ్వర కాలేజీ, ఢిల్లీ యూనివర్సిటీకి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్స్ తనిఖీలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సోదాలు చేపట్టారు. బుధవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయానికి బూటకపు బెదిరింపు కాల్ తేల్చిన మరుసటి రోజే బెదిరింపులు రావడంపై అధికారులు అయోమయానికి గురవుతున్నారు. లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Swati maliwal: పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం పోలీసులకు రిక్వెస్ట్.. కారణమిదే!
గురువారం తెల్లవారుజామున కర్ణాటకలోని బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ సహా మూడు హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఏప్రిల్ 30న ఢిల్లీలోని చాచా నెహ్రూ హాస్పిటల్‌కు బెదిరింపు కాల్‌తో ఈ ఘటనల పరంపర మొదలైంది. ఆ తర్వాత మే 1న 150 పాఠశాలలకు ముప్పు వచ్చింది. రష్యాకు చెందిన మెయిలింగ్ సర్వీస్ కంపెనీ నుంచి పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. ఇరవై ఆసుపత్రులు, విమానాశ్రయం మరియు ఢిల్లీలోని ఉత్తర రైల్వే యొక్క CPRO కార్యాలయానికి మే 12న బాంబు బెదిరింపులు వచ్చాయి. మే 14న ఢిల్లీలోని ఏడు ఆసుపత్రులకు, తీహార్ జైలుకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
ఇది కూడా చదవండి: Viral Video: ఒక్కసారిగా ఇంట్లో ఎగిసిన మంట.. పిల్లాడి సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం..
