Javed Akhtar : మన తెలుగు హీరోలపై బాలీవుడ్ సెలబ్రిటీలు, డైరెక్టర్లు, రచయితలు నిత్యం అక్కసు బయటపెడుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రముఖ రచయిత జావెద్ అక్తర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సౌత్ హీరోలను అత్యంత దారుణంగా అవమానిస్తూ ఆయన మాట్లాడారు. జావెద్ అక్తర్ అనే వ్యక్తి మామూలు పర్సన్ కాదు. బాలీవుడ్ లో షోలే లాంటి ఎవర్ గ్రీన్ సినిమాలకు రచయిత. ఎన్నో ప్రఖ్యాత సినిమాలకు కథ రాసిన వ్యక్తి. అంత విజ్ఞానం ఉన్న జావెద్.. తాజాగా అమీర్ ఖాన్ తో కలిసి ఓ పాడ్ కాస్ట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. “సౌత్ లో ముక్కు, మొహం తెలియని హీరోల సినిమాలు హిందీలో ఐదారు వందల కోట్లు వసూలు వసూలు చేస్తున్నాయి. కానీ మన సినిమాలు ఆదరణ పొందలేకపోతున్నాయి. ఇది చాలా బాధాకరం” అంటూ చెప్పుకొచ్చాడు.
Read Also : SSMB 29 : మహేష్ బాబు షూట్లో జాయినైన ప్రియాంక చోప్రా
పక్కనే ఉన్న అమీర్ ఖాన్ దీనికి కాస్త హుందాగా సమాధానం చెప్పినా అది కవర్ చేయలేకపోయింది. జావెద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు పుష్ప-2 సినిమా గురించే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా తెరకెక్కినా వాటిపై ఆయన మాట్లాడలేదు. మీర్జాపూర్ లాంటి బూతు సిరీస్ ను విమర్శించలేదు. యూత్ మద్యం, డ్రగ్స్ తీసుకునేలా ప్రేరేపించే ఎన్నో సినిమాలను ఆయన ఖండించలేదు. కానీ మన సౌత్ హీరోల సినిమాలపై మాత్రం వెంటనే నోరు జారుతున్నారు అంటూ ప్రేక్షకులు మండిపడుతున్నారు. సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారని గుర్తు చేస్తున్నారు. సౌత్ హీరోలు అంటే అంత చిన్నచూపు పనికి రాదని హితవు పలుకుతున్నారు.
Read Also : Priyadarshi : “గేమ్ ఛేంజర్” కోసం 25 రోజుల కాల్షీట్లు ఇచ్చా.. మొత్తం లేపేశారు