NTV Telugu Site icon

Sara Ali Khan: జాన్వీ కపూర్ బాటలో సారా అలీ ఖాన్.. సరైన కథ కోసం ఎదురుచూపు!

Sara Ali Khan

Sara Ali Khan

తెలుగు సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సత్తాచాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, సలార్, కల్కి చిత్రాలు భారతీయ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద దండయాత్ర చేయడానికి ‘దేవర’ సిద్ధం కాగా.. పుష్ప 2, ఎస్ఎస్ఎంబీ 29 రికార్డు నెలకొల్పడానికి రెడీ అవుతున్నాయి. ప్రస్తుత క్రేజ్ కారణంగా తెలుగు సినిమాల్లో నటించడానికి చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు టాలీవుడ్‌పై కన్నేస్తున్నారు.

బాలీవుడ్ భామలు కృతి సనన్, కియారా అద్వానీ, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనెలు తెలుగు సినిమాల్లో నటించారు. అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే దేవర పార్ట్ 1 పూర్తి చేసిన జాన్వీ.. రామ్ చరణ్-బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో నటిస్తున్నారు. దేవర హిట్ అయితే జాన్వీకి తెలుగులో మరిన్ని అవకాశాలు రావడం పక్కా.

Also Read: Jani Master Wife: ఆ అమ్మాయి నిజం నిరూపిస్తే.. నా భర్తను వదిలేస్తా!

బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ కూడా టాలీవుడ్‌లో నటించే అవకాశాలు ఉన్నాయి. ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో బాలీవుడ్ హీరోయిన్ కూడా టాలీవుడ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. జాన్వీ కపూర్ బాటలోనే ఆమె బెస్ట్ ఫ్రెండ్ సారా అలీ ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నారట. మంచి కథ కోసం సారా ఎదురుచూస్తున్నారట. మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలకు సారా సరైన జోడిగా ఉంటుంది. బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.

Show comments