NTV Telugu Site icon

Malaika Arora: నటి మలైకా అరోరా ఇంట్లో విషాదం.. ఏడో ఫ్లోర్ నుంచి దూకి..!

Malaika Arora Father Dead

Malaika Arora Father Dead

Malaika Arora’s Father Jumped off a Building: బాలీవుడ్‌ సీనియర్ నటి మలైకా అరోరా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మలైకా తండ్రి అనిల్‌ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం ముంబైలోని బాంద్రాలో ఏడో ఫ్లోర్ ఉన్న తన ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న బాంద్రా పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకున్నారు. అనిల్‌ అరోరా మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

సంఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లభించలేదని బాంద్రా పోలీసులు చెప్పారు. అయితే అనిల్‌ అరోరా చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారట. ప్రస్తుతం ఇంట్లోనే ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న ఆయన.. నేడు ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పంజాబ్‌కు చెందిన అనిల్ అరోరా గతంలో మర్చంట్ నావీలో పనిచేశారు. మలైకా అరోరాకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. మలైకా, ఆమె సోదరి అమృత తన తల్లి జాయిస్ పాలీకార్ప్ వద్ద పెరిగారు.

Also Read: Vinesh Phogat: పీటీ ఉష ఫొటో కోసమే వచ్చారు.. అదో పెద్ద రాజకీయం: వినేశ్‌ ఫొగాట్

అనిల్‌ అరోరా ఆత్మహత్య విషయం తెలియగానే మలైకా కుటుంబ సభ్యులు, ఆమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్‌ బాంద్రాలోని నివాసానికి చేరుకున్నారు. బాలీవుడ్ ప్రముఖులు ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. నటి, మోడల్‌, డ్యాన్సర్‌గా మలైకాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చయ్య చయ్య, గుర్ నాలో ఇష్క్ మితా, మాహి వే, కాల్ ధమాల్ మరియు మున్నీ బద్నామ్ వంటి పాటలలో బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు.

Show comments