Fighter : బాలీవుడ్ యాక్షన్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేది ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన బాలీవుడ్ యాక్షన్ మూవీ ఫైటర్. ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. గతేడాది దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కించిన పఠాన్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీనితో ఫైటర్ మూవీకి విడుదలకు ముందు భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి..భారీ అంచనాలతో ఈ ఏడాది రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అయిన ఫైటర్ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. 19 రోజుల్లో ఈ మూవీ రూ.340 కోట్లు వసూలు చేసింది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం అద్భుతాలు చేయలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’ ఈ సినిమా ఓటీటీ హక్కులను సొంతం చేసుకుంది.అయితేఫైటర్ మూవీ జనవరి 25న థియేటర్లలోకి రాగా.. రెండు నెలలోపే అంటే మార్చి 21న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.అయితే దీనిపై ఇప్పటి వరకూ అధికారిక సమాచారం ఏదీ రాలేదు. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ఓ కీలకమైన పాత్ర పోషించారు.ఫైటర్ మూవీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాహసాల చుట్టూ తిరుగుతుంది.
పాకిస్థాన్ కు వ్యతిరేకంగా వచ్చిన మరో బాలీవుడ్ సినిమా కావడంతో ఆ దేశం నుంచి ఈ మూవీపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే వీటికి మూవీ టీమ్ గట్టిగానే సమాధానం ఇచ్చింది.అయితే ఫైటర్ మూవీ ఈ మధ్య వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా ఎవరిపై చిత్రీకరించారో అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మూవీ టీమ్ కి పెద్ద షాక్ ఇచ్చింది. ఫైటర్ చిత్రంలో హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిఫాం ధరించి లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. దీనిపై అభ్యంతరం తెలుపుతూ ఐఏఎఫ్ అధికారి వింగ్ కమాండర్ సౌమ్యదీప్ దాస్ నోటీసులు పంపించారు. ఐఏఎఫ్ యూనిఫాం కేవలం దుస్తులు మాత్రమే కాదని, విధి నిర్వహణ, దేశ భద్రత మరియు నిస్వార్థ సేవ పట్ల అచంచలమైన నిబద్ధతకు బలమైన చిహ్నమని ఆ నోటీసులో వారు పేర్కొన్నారు.అలాంటి ఉన్నతమైన దుస్తులు ధరించి లిప్ కిస్ పెట్టుకోవడం, శృంగారంతో బంధాలను ప్రోత్సహించే సన్నివేశానికి ఉపయోగించడం అంటే వాయుసేన అధికారులను కించపరచడమే అవుతుందని వారు అభిప్రాయపడ్డారు.
Also Read
- Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
- CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
- Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
- Supreme Court: మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల వివాదంపై సుప్రీంకు వైసీపీ.. నేడు సీజేఐ ధర్మాసనం విచారణ
తాజావార్తలు
-
Bhagwant Mann: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో సీఎం భగవంత్ మాన్కు అవమానం.. ఆప్ ఆగ్రహం
-
Police Martyrs’ Day 2026: పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 2026.. పోలీసు కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి భరోసా
-
CM Chandrababu: పోలీసుల త్యాగాలకు సెల్యూట్.. ధైర్యంతో పాటు మానవత్వం అవసరం..
-
Tiger Shroff Firing Case: టైగర్ ష్రాఫ్ కాల్పుల కేసు.. ఇద్దరు మహిళలు సహా నలుగురు అరెస్ట్!
-
Simon Harmer: 18 ఏళ్ల రికార్డు బద్దలు.. బౌలర్‌గా వచ్చి బ్యాటింగ్‌లో అదరగొట్టి..
ట్రెండింగ్
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!