NTV Telugu Site icon

Mixup : ఓటీటీలోకి వచ్చేస్తున్న బోల్డ్ మూవీ..ఆకట్టుకుంటున్న టీజర్..

Whatsapp Image 2024 02 24 At 11.11.31 Pm

Whatsapp Image 2024 02 24 At 11.11.31 Pm

ఓటీటీలకు ఆదరణ లభించడంతో వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలు ఓటీటీ సంస్థలు ఎంతగానో అలరిస్తున్నాయి. అలాగే ఓటీటీలో సెన్సార్ కూడా లేకపోవడంతో బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ లు, సినిమాలు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి.వారానికి ఓ బోల్డ్ కంటెంట్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.ఆహా ఓటీటీ ద్వారా ఓ బోల్డ్ మూవీ త్వరలో తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. మిక్సప్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను గురువారం ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. మిక్సప్‌లో అక్షర గౌడ, ఆదర్శ్ బాలకృష్ణన్‌, కమల్ కామరాజు మరియు పూజా జవేరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఓ రెండు జంటల కథతో బోల్డ్‌గా మిక్సప్‌ టీజర్ సాగింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ మరియు ఇంటిమేట్ సీన్స్‌తో యూత్‌ను అట్రాక్ట్ చేసేలా ఈ టీజర్‌ను కట్ చేశారు.

నాకు మూడ్ రావాలంటే ఎక్సైట్‌మెంట్ కావాలి. ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి అనే డైలాగ్‌తోనే ఇంట్రెస్టింగ్‌గా టీజర్ ప్రారంభమైంది. దేవుడు మనుషులకు చేతులు ఎందుకు ఇచ్చాడో ఇప్పుడు అర్థమైంది అంటూ ఆదర్శ్ బాలకృష్ణ డైలాగ్‌తో ఎండ్ చేశారు. ఈ టీజర్‌లో అక్షర గౌడ్ అందాలను ఆరబోసింది. ఆమెతో పాటు పూజా జవేరి క్యారెక్టర్ కూడా ఎంతో రొమాంటిక్‌గా సాగింది. మిక్సప్‌ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.పెళ్లైన రెండు జంట జీవితంలో సెక్స్ విషయంలో నెలకొన్న అపోహలు, అపార్థాలతో దర్శకుడు మిక్సప్ మూవీని తెరకెక్కించినట్లు కనిపిస్తోంది. రొమాన్స్‌తో పాటు చిన్న మెసేజ్‌ను కూడా సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం.మిక్సప్ మూవీ రిలీజ్ డేట్‌ను శనివారం అఫీషియల్‌గా అనౌన్స్‌చేశారు. మార్చి 15 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఓటీటీలోనే ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. టీజర్‌తో మిక్సప్ మూవీ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసారు.మొదలుపెట్టారు. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది మాత్రం టీజర్‌లో రివీల్ చేయలేదు.