తమిళనాడులో ఓ సెప్టిక్ ట్యాంక్‌లో 9 ఏళ్ల బాలుడి మృతదేహం లభ్యమైంది. మధురైలోని ఉర్దూ ప్రమోషన్ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు హత్య చేసి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో పడేశారు. అనంతరం బాలుడి మృతదేహాంపై సమాచారం అందడంతో అందులో నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మధురైలోని కథపట్టి గ్రామంలో చోటు చేసుకుంది.
Read Also: Cyclone Remal: రెమల్ తుఫాను బీభత్సం.. బెంగాల్‌లో ఇద్దరు మృతి
వివరాల్లోకి వెళ్తే.. బాలుడు బీహార్‌కు చెందినవాడిగా గుర్తించారు. అతను 11 మంది విద్యార్థులతో కలిసి ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్నాడు. అయితే బాలుడు కనిపించకపోవడంతో ఇన్‌స్టిట్యూట్ వార్డెన్ శనివారం (మే 25) పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలుడి కోసం వెతకడం ప్రారంభించారు. అందులో భాగంగా.. బాలుడి మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్ లో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. అతని మెడ, కడుపుపై పలు కత్తిపోట్లను గుర్తించారు.
Read Also: Swati Maliwal Case: కోర్టులో కన్నీళ్లు పెట్టుకున్న స్వాతి మలివాల్..ఎందుకంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇన్‌స్టిట్యూట్‌లో చదువుతున్న 13 ఏళ్ల బాలుడితో ఈ బాలుడు గొడవ పడ్డాడని చెప్పారు. అయితే.. ఈ గొడవ విషయంలో హత్య చేసుంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో.. నిందితుడు 13 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.