నిజామాబాద్ జిల్లా బోధన్ ఎమ్మెల్యే షకీల్ హత్యయత్నం కేసులో పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుడు అల్తాప్ తండ్రి అబ్దుల్ బాకీ ఖురాన్ తలపై పెట్టుకుని చేసిన వ్యాఖ్యలపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఓ వీడియోను విడుదల చేశాడు. నా హత్యకు కుట్ర చేశారు.. సొంత పార్టీ కౌన్సిలర్లు, ఎంఐఎం నేతలు ముఠాగా ఏర్పడారు అని ఆయన అన్నారు. దాడి, హత్యాయత్నానికి పాల్పడటం వల్లే పోలీసులు నిందితులను జైలుకు పంపారు అని ఎమ్మెల్యే తెలిపారు. జైలులో ఉన్న ఇద్దరు ఎంఐఎం యువకులకు నేర చరిత్ర ఉంది.. సంఘ విద్రోహ శక్తులతో సంబంధాలు ఉన్నాయని బోధన్ ఎమ్మెల్యే షకీల్ అన్నాడు.
Read Also: SPY Collections: ‘స్పై’ బాలేదనుకుంటూనే బాక్సాఫీసు వద్ద ఈ కలెక్షన్లు ఏంటి సామీ!
సొంత పార్టీ కౌన్సిలర్లు శరత్ రెడ్డి, మీర్ నజీర్, షరీఫ్ తో ఎంఐఎం నేతలు అల్తాప్, నవీద్ లతో చేతులు కలిపారు ప్లాన్ ప్రకారం నా హత్యకు కుట్ర చేశారు. వారిపై పిడీ యాక్ట్ నమోదు చేయాలి.. అసదుద్దున్ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే షకీల్ పేర్కొన్నాడు. ఎన్నికలు రాగానే ఆయన నైజం బయట పెడుతున్నారు. ఎన్నికల్లో చూసుకుంటామని బెదిరిస్తే భయపడే వారు లేరు.. దమ్ముంటే ముందు నుంచి కొట్లాడండి.. వెనక నుంచి కాదు.. ఈ సారి ఎన్నికల్లో తేల్చుకుందాం.. బోధన్ ప్రజలు నాతోనే ఉన్నారు అని ఎమ్మెల్యే షకీల్ అన్నారు.
అయితే నిన్న(గురువారం) బక్రీద్ పండగ సందర్భంగా అల్తాఫ్ తండ్రి అబ్దుల్ బాకీ కన్నీరు పెట్టుకున్నారు. తన కొడుక్కి ఏ పాపం తెలియదని ఖురాన్ నెత్తిన పెట్టుకొని ఏడ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్పట్టణ శివారులోని దర్గా వద్ద ముస్లిం సోదరులు నమాజ్చేస్తున్నారు. నమాజ్ ముగిసిన తర్వాత వేదికపైకి ఖురాన్తో వచ్చిన బాకీ, మైక్ఎదుట బోరున విలపించారు. కన్నీరు పెడ్తున్న అబ్దుల్ బాకీని తోటి ముస్లింలు ఓదార్చి పక్కకు తీసుకెళ్లారు.