కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరు మండలం కడపకొల్లు గ్రామంలో ప్రచారం సందర్భంగా మంత్రి జోగి రమేష్ పై టీడీపీ నేత బొడే ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరేయ్ పిల్ల బచ్చా రోగ్ రమేష్ అంటూ విమర్శించారు. జోగి రమేష్ నువ్వు స్వయం కృషిపై మంత్రి అయ్యావా అని ప్రశ్నించారు.. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడా మీకు కళ్ళు కనిపించట్లేదు.. అందరూ కూడా నిన్ను గూర్క అని పిలిచేది అందుకే అంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రిగా పని చేశారన్నారు. మేము చాలా సంస్కారంగా మాట్లాడుతున్నాము.. నీకు నోరు ఉంది కదా అని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నాడు.. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా.. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు అది గుర్తుంచుకో అని బొడే ప్రసాద్ తెలిపారు.
నీ స్థాయి ఏంటి జోగి రమేష్ లాగులు వేసుకుని లారీల దగ్గర గుమస్తాగా పని చేశావు అంటూ టీడీపీ నేత బొడే ప్రసాద్ విమర్శించారు. నీకు ఇన్ని కోట్ల ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. నిన్ను మైలవరంలో ఛీ కొడితే రాజశేఖర్ రెడ్డి కాళ్లు పట్టుకొని, క్యారేజీలు మోస్తే నిన్ను పెడన పంపారు.. చంద్రబాబు నాయుడు సారథికి వెన్నుపోటు పొడిచారని అంటున్నావు సారథి నూజివీడులో గెలవబోతున్నారు.. అసలైన వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి నీకు పొడిచాడు.. తనపై నువ్వు ఓడిపోయి నీకు రాజకీయ సమాధి కట్టడానికి పెనమలూరు పంపారని విమర్శలు గుప్పించారు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టిన నియోజవర్గ ప్రజలు నన్ను భారీ మెజారిటీతో గెలిపించబోతున్నారు.. ఈ నియోజకవర్గంలో నువ్వు ఓడిపోవడం ఖాయం అని ఓడిపోయాక నువ్వు ఇక్కడే ఉంటావా లేదా ప్రజలకు చెప్పు అని బొడే ప్రసాద్ ప్రశ్నించారు.
Read Also: Ugadi 2024: ఉగాది పచ్చడిని ఎందుకు చేసుకుంటారో తెలుసా?
నువ్వు చంద్రబాబుపై నోరు పారేసుకున్నంత కాలం నేను కూడా ఇలాగే మాట్లాడతాను అని బొడే ప్రసాద్ పేర్కొన్నారు. మీ ప్రభుత్వం రాదని తెలిసే ఎమ్మెల్యేలు, మంత్రులు దుకాణం సర్దేసుకుంటున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేసి మంత్రి పదవి పొందావని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబునీ ఎవరైతే ఎక్కువ తిట్టుతున్నారో వారికే మంత్రి పదవులు టికెట్లు ఇస్తున్నారు అని ఆయన ఆరోపించారు. తనపై కాల్ మనీ, సెక్స్ రాకెట్లు అని అంటున్నావు.. అలా అన్న మంత్రి రోజాకు గడ్డి పెట్టాను.. నీకు కూడా అలాగే గడ్డి పెడతానో పెంట పెడతానో చూద్దువు అన్నారు. నీపై ఉన్న అభియోగాలు బయటకు తీస్తే మీ ఇంట్లో వాళ్ళు నీతో కాపురం కూడా చెయ్యరు.. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే రోజాకు పట్టిన గతే మీకు పడుతుంది అని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొడే ప్రసాద్ హెచ్చరించారు.