Site icon NTV Telugu

Kanguva: ‘కంగువ’ డైరెక్టర్ ప్లాన్ అదిరిపోయింది.. ఏకంగా 10 వేల మందితో సీన్..

Kanguva1

Kanguva1

తమిళ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు..ఇప్పుడు పాన్ ఇండియా మూవీలలో నటిస్తున్నాడు. ప్రస్తుతం కంగువ సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచుతున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..

ప్రస్తుతం శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు మేకర్స్.. ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. సూర్య, బాబీ డియోల్ మధ్య ఓ అత్యంత భారీ యుద్ధానికి సంబంధించిన సీన్ తీసినట్లు తెలుస్తుంది. ఈ సినిమా కోసం తీస్తున్న వార్ సీన్ ను ఏకంగా 10 వేల మందితో తీసినట్లు చెప్పడం విశేషం.. ఈ సీన్ సినిమాకు హైలెట్ గా నిలవనుంది.. భారీ బడ్జెట్ తో ఈ సిన్ ను రూపోందిస్తున్నారని ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది.

ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన టీజర్ అసలు సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. ఇందులో సూర్య, బాబీ డియోల్ ఒకరికొకరు ఎదురుపడటం చూడొచ్చు.టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా ఈ ఏడాది ఏకంగా పది భాషల్లో రిలీజ్ కానుంది. యూవీ క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. 3డీ ఫార్మాట్లోనూ సినిమా రానుంది.. ఈ సినిమా విడుదల తేదీ పై అధికార ప్రకటన అయితే రాలేదు కానీ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. కంగువ తర్వాత సూర్య 43 సినిమాను సుధా కొంగర దర్శకత్వంలో రాబోతుంది.. సూర్య ‘పురాణనూరు’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా పై త్వరలోనే మరో అప్డేట్ రానుందని సమాచారం..

Exit mobile version