NTV Telugu Site icon

Boat Ride on Crocodiles: ఈడు మగాడ్రా బుజ్జి.. వందలాది మొసళ్లనే ఉ** పోయించాడుగా! వీడియో వైరల్

Boat Ride In Crocodiles

Boat Ride In Crocodiles

A Terrifying Boat pass through a Crocodiles River: నీటిలో మునిగి తేలుతూ.. నేలపై పాకుతూ ఆహారాన్ని వేటాడే భయంకరమైన జీవి ఏదంటే ‘మొసలి’ అని ప్రతి ఒక్కరు ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పేస్తారు. నీటిలో అయినా లేదా నేలపై అయినా మొసలి ఆహారాన్ని వెతుక్కుంటూ వేటకు వెళ్లిందంటే.. తప్పకుండా ఏదో ఓ ప్రాణి బలి కావాల్సిందే. మొసలి పట్టు అలాంటిది మరి. ఒక్కసారి మొసలి నోటి దగ్గరికి ఏదైనా వెళ్లిందంటే.. తప్పించుకోవడం అసాధ్యం. అది అడవికి రారాజు సింహం అయినా బలవ్వాల్సిందే. ఇక మనుషుల సంగతి చెప్పక్కర్లేదు. ఎవరూ కూడా మొసలి దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. అలాంటిది ఓ వ్యక్తి వందలాది మొసళ్ల గుంపునే ఉచ్చ పోయించాడు.

వైరల్ అవుతున్న ఈ వీడియో ప్రకారం… వందల సంఖ్యలో మొసళ్లు ఉన్న ఓ నదిలో ఓ బోటు ప్రయాణిస్తుంటుంది. బోటు ముందుకు వెళ్తున్నా కొద్దీ.. ఇంజిన్ శబ్దానికి మొసళ్లు బయపడి నది ఒడ్డుకు చేరుకుంటాయి. బోటు వేగంగా దూసుకెళుతుండంతో వందలాది మొసళ్లు నీటిలో పరిగెడుతుంటాయి. కొన్నింటిపై బోటు కూడా వెళుతుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వీర అవుతోంది.

Also Read: IND vs IRE: నేడు ఐర్లాండ్‌తో రెండో టీ20.. సిరీస్‌పై భారత్ కన్ను! అందరి కళ్లు అతడిపైనే

ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియరాలేదు. ఏ వీడియోను ‘CCTV IDIOTS’ అనే ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ‘ఒక భయంకరమైన పడవ నది గుండా వెళుతుంది’ అని క్యాప్సన్ ఇచారు. ఈ వీడియోకి లైక్స్ కామెంట్ల వర్షం కురుస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దృశ్యాలను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ‘వందల సంఖ్యలో మొసళ్లతో ఆడుకోవడం ఏంది సామీ’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘ఈడు మగాడ్రా బుజ్జి’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అంత ప్రమాదకర నదిలో నుంచి ఆ బోటు ఎందుకు వెళ్ళింది? అంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.