Site icon NTV Telugu

Boat Accident: అవుకు రిజర్వాయర్‌లో పడవ బోల్తా.. ఇద్దరు గల్లంతు

Boat

Boat

Boat Accident: నంద్యాల జిల్లా అవుకు తిమ్మరాజు జలాశయంలో పడవ ప్రమాదం చోటుచేసుకుంది జరిగింది. 12 మందితో వెళ్తున్న బోటు ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు చనిపోయారు. మరొకరు గల్లంతయ్యారు. 10 మందిని స్థానికులు రక్షించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు గల్లంతు కాగా.. గల్లంతయిన వారిలో ఆశ అనే అమ్మాయి మృతదేహం లభ్యమైంది. మరొకరి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

Read Also: LB nagar flyover: ఫ్లైఓవర్‌ పై ఓ వ్యక్తి ఆత్మహత్య యత్నం.. మాటల్లో పెట్టి కాపాడిన కానిస్టేబుల్‌

ఆదివారం సెలవు కావడంతో కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్‌లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రసూల్ కుటుంబం విహార యాత్రకు వెళ్లింది. ఫ్యామిలీ బోటులో వీరంతా ప్రయాణిస్తుండగా దురదృష్టవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. ఫోటోలు తీసుకునేందుకు కుటుంబసభ్యులంతా ఓ వైపుకు రాగా.. గాలిలో అలల తాకిడికి పడవ బోల్తా పడినట్లు తెలుస్తోంది.

Exit mobile version