Site icon NTV Telugu

Boat Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఊడిముడి వద్ద పడవ బోల్తా..

Ambedhkar Konaseema

Ambedhkar Konaseema

అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం ఊడిముడి వద్ద పడవ ప్రమాదం జరిగింది. వరద ప్రభావిత లంక గ్రామాలకు పడవలో వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో పడవలో ఆరుగురు ప్రయాణిస్తుండగా వరద ప్రవాహానికి పడవ బోల్తా పడింది. అందులో ఉన్న ఐదుగురిని స్థానిక మత్స్యకారులు నాటు పడవలో వెళ్లి రక్షించగా.. ఒకరు గల్లంతు అయ్యారు. ప్రమాదం నుంచి బయటపడ్డ వారు లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వారు సురక్షితంగా బయటపడ్డారు.

Read Also: Andhra Pradesh: రాష్ట్రంలో భారీ వర్షాలు.. వరదల్లో గ్రామాలు

లైఫ్ జాకెట్టు చేతితో పట్టుకుని కుర్చున్న వ్యక్తి వరద ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గల్లంతు అయిన వ్యక్తి ఊడిముడికి చెందిన చదలవాడ విజయ కృష్ణగా గుర్తించారు. గల్లంతైన విజయ్ కృష్ణ కోసం సహాయక సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ అధికారులు గాలింపు చర్యలు చేస్తున్నారు. కాగా.. గత వారం నుంచి కురిసిన భారీ వర్షాల ధాటికి తాత్కాలికంగా వేసిన గట్టు తెగిపోయింది. దీంతో నాలుగు గ్రామాల ప్రజలకు రోడ్డు సౌకర్యం లేక.. పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో.. ఆ గ్రామ ప్రజలకు పంచాయతీ సిబ్బంది వాటర్ ప్యాకెట్స్ తీసుకెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.

Read Also: Tamil Nadu: తమిళనాడులో మరో రాజకీయ హత్య.. ఏఐడీఎంకే నేత మర్డర్..

Exit mobile version