NTV Telugu Site icon

Indonesia: ఇండోనేషియాలో ఘోరం.. పడవ ప్రమాదంలో 14మంది మృతి

Indonasia

Indonasia

Indonesia: ఇండోనేషియాలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. 240 మందితో దక్షిణ ఇండోనేషియా ప్రాంతంలో ప్రయాణిస్తున్న పడవలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 14 మంది మృతి చెందారు. పెద్ద సంఖ్యలో ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో పడవలో 230 మంది ప్రయాణికులుండగా, మిగిలిన 10 మంది సిబ్బందిగా అధికారులు గుర్తించారు. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. 226 మందిని రెస్క్యూ టీమ్ రక్షించినట్లు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

Read Also: Nithin : దివాళీ డబుల్ ఢమాకా.. ఆ హీరో అదృష్టం మామూలుగా లేదుగా

‘KM ఎక్స్‌ప్రెస్ కాంటికా 77’ పడవ తూర్పు నుసా టెంగ్‌గారా ప్రావిన్స్‌లోని కుపాంగ్ నుండి కలాబాహి వైపు వెళ్తుండగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో పడవలో 230 ప్రయాణికులు, 10 మంది సిబ్బంది ఉన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also: Kantara Movie : కాంతారకు లీగల్ నోటీసులు ?.. ఎందుకంటే

కాగా.. 17,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ఇండోనేషియాలో ఫెర్రీ, పడవ ప్రమాదాలు సర్వసాధారణం. ఎలాంటి భద్రత ప్రమాణాలు పాటించకుండా సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలించడం కారణంగా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి.2018లో ఉత్తర సుమత్రా ప్రావిన్స్‌లోని లోతైన అగ్నిపర్వత బిలం సరస్సులో సుమారు 200 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఫెర్రీ మునిగి 167 మంది మృత్యువాతపడ్డారు. ఇండోనేషియాలో జరిగిన విషాద ఘటనల్లో 1999 పడవ ప్రమాదం ఒకటి. ఈ ప్రమాదంలో 332 మందితో వెళ్తున్న ఓడ మునిగిపోయింది. ఈఘటనలో 20 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.