Site icon NTV Telugu

Premalu : బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమలు’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..?

Whatsapp Image 2024 03 14 At 2.00.28 Pm

Whatsapp Image 2024 03 14 At 2.00.28 Pm

యూత్‌ఫుల్ క్రేజీ లవ్‌స్టోరీగా వచ్చిన ప్రేమలు మూవీ మలయాళంలో ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.. థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా మలయాళంలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. నస్లీన్‌ మరియు మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.ప్రేమలు మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నది. మార్చి 29 నుంచి ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రేమలు రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తొలుత ఈ సినిమాను మార్చి ఫస్ట్ వీక్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. ప్రేమలు తెలుగు వెర్షన్ మార్చి 8న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ వెర్షన్ మార్చి 15న రిలీజ్ అవుతోంది. అందువల్లే ఓటీటీ రిలీజ్ డిలే అయినట్లు తెలుస్తుంది.

ప్రేమలు తెలుగు వెర్షన్‌ను దిగ్గజ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. ఏడు రోజుల్లో ఈ మూవీ ఐదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. కార్తికేయకు ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది.మలయాళంలో పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను రాబట్టి మలయాళ సినీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.ప్రేమలు సినిమాను దర్శకుడు గిరీష్‌ హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాడు. సచిన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. కానీ వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ కి వస్తాడు. ఓ వేడుకలో అతడికి రీనూ పరిచయం అవుతుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు సచిన్‌.అప్పటికే లవ్‌లో ఓ సారి ఫెయిలైన సచిన్‌…రీనుకు తన ప్రేమను ఎలా చెప్పాడు..?  సచిన్‌, రీనూ చివరకు ఒక్కటయ్యారా..లేదా? అన్నదే ఈ మూవీ కథ.

Exit mobile version