Premalu : బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమలు’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూత్‌ఫుల్ క్రేజీ లవ్‌స్టోరీగా వచ్చిన ప్రేమలు మూవీ మలయాళంలో ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.. థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా మలయాళంలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. నస్లీన్ మరియు మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.ప్రేమలు మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకున్నది. మార్చి 29 నుంచి ఈ యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ప్రేమలు రిలీజ్ కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.తొలుత ఈ సినిమాను మార్చి ఫస్ట్ వీక్‌లోనే ఓటీటీలో రిలీజ్ చేయాలని డిస్నీ హాట్‌స్టార్ ప్లాన్ చేసింది. ప్రేమలు తెలుగు వెర్షన్ మార్చి 8న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళ వెర్షన్ మార్చి 15న రిలీజ్ అవుతోంది. అందువల్లే ఓటీటీ రిలీజ్ డిలే అయినట్లు తెలుస్తుంది.
ప్రేమలు తెలుగు వెర్షన్‌ను దిగ్గజ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశారు. ఏడు రోజుల్లో ఈ మూవీ ఐదు కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. కార్తికేయకు ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది.మలయాళంలో పది కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ వంద కోట్ల వసూళ్లను రాబట్టి మలయాళ సినీ చరిత్రలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.ప్రేమలు సినిమాను దర్శకుడు గిరీష్ హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించాడు. సచిన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని కలలు కంటాడు. కానీ వీసా రిజెక్ట్ కావడంతో గేట్ కోచింగ్ కోసం హైదరాబాద్ కి వస్తాడు. ఓ వేడుకలో అతడికి రీనూ పరిచయం అవుతుంది. సాఫ్ట్వేర్ జాబ్ చేసే రీనూతో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు సచిన్.అప్పటికే లవ్‌లో ఓ సారి ఫెయిలైన సచిన్…రీనుకు తన ప్రేమను ఎలా చెప్పాడు..? సచిన్, రీనూ చివరకు ఒక్కటయ్యారా..లేదా? అన్నదే ఈ మూవీ కథ.
Also Read
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!