NTV Telugu Site icon

Jawan Twitter Review: ‘జవాన్‌’ బ్లాక్‌ బస్టర్‌ హిట్‌.. ఈ ఏడాది షారుఖ్‌ ఖాన్‌దే!

Jawan Twitter Review

Jawan Twitter Review

Shah Rukh Khan and Nayanthara’s Jawan Movie Twitter Review: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘జవాన్‌’. సక్సెస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్మెంట్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. జవాన్‌ సినిమాలో కోలీవుడ్‌ హీరో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించగా.. దీపికా పదుకొణె, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య జవాన్‌ చిత్రం హిందీతో తెలుగు, తమిళ భాషల్లో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

బుధవారం రాత్రి ముంబైలో స్పెషల్ షో పడింది. ఇప్పటికే ఓవర్సీస్‌తో పలు చోట్ల ఫస్ట్‌ షో పడిపోయింది. దీంతో సినిమా చూసిన ఫాన్స్ సోషల్‌ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. జవాన్‌ మూవీ ఎలా ఉంది?, స్టోరీ ఏంటి?, నటీనటులు ఎలా చేశారు? అనే తదితర విషయాలు ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. జవాన్‌ సినిమాకి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ టాక్ వస్తోంది. షారుఖ్‌ ఖాతాలో మరో భారీ హిట్‌ పడిందని, ఈ ఏడాది షారుఖ్‌ ఖాన్‌దే, జవాన్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్స్ బద్దలు కొడుతుందని అని కామెంట్‌ చేస్తున్నారు.

జవాన్‌ నుంచి విడుదలైన ట్రైలర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దానికి తోడు మూవీ ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో.. జవాన్‌పై భారీ హైప్‌ క్రియేట్‌ అయింది. ఇండస్ట్రీ హిట్ ‘పఠాన్’ తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు పెంచాయి. ఆ అంచనాలను జవాన్‌ అందుకుందని ఫాన్స్ పేర్కొంటున్నారు. ‘యాక్షన్‌ సీక్వెన్స్‌ అదిరిపోయాయి. షారుఖ్‌ నటన అదుర్స్‌’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘అట్లీ అద్భుతమైన కళాఖండాన్ని అందించాడు. ఎమోషన్స్‌, మాస్‌ యాక్షన్స్‌తో అద్భుతంగా సినిమాను తీశాడు’ అంటున్నారు.