Site icon NTV Telugu

DJ Sound Effect : అలర్ట్.. డీజే శబ్ధం కారణంగా మెదడులో రక్తస్రావం.. పరిస్థితి విషమం!

Dj Effect

Dj Effect

ఛత్తీస్‌గఢ్‌లో షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది. డీజే శబ్ధం కారణంగా ఓ వ్యక్తి యొక్క సిర పగిలి మెదడులో రక్తస్రావం జరిగింది. అనంతరం అంబికాపూర్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇంతలో.. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యులు రాయ్పూర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. డీజే శబ్దం కారణంగా తల వెనుక భాగంలోని సిర పగిలి రక్తం గడ్డకట్టే అవకాశం ఉందని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు.

READ MORE: Nani : ముచ్చటగా మురోసారి ‘నాని – సాయి పల్లవి’.. దర్శకుడు ఎవరంటే..?

పెద్దగా డీజే శబ్దం రావడంతో సిర పగిలి..
బల్రాంపూర్ జిల్లాలోని సనావాల్ నివాసి 40 ఏళ్ల సంజయ్ జైస్వాల్ సెప్టెంబర్ 9 న అకస్మాత్తుగా తల తిరగడం, వాంతులు చేయడం ప్రారంభించాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇయర్ నోస్ థ్రోట్ (ఈఎన్ టీ) విభాగానికి చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ శైలేంద్ర గుప్తా సీటీ స్కాన్ చేసి రిపోర్టును చూడగా.. తల వెనుక భాగంలోని సిర పగిలి రక్తం గడ్డకట్టినట్లు తేలింది. ఈ మేరకు వైద్య కళాశాల సీనియర్‌ వైద్యులు, మెడికల్‌ ప్రొఫెసర్లకు సమాచారం అందించారు. డాక్టర్ గుప్తా రోగిని పరీక్షించి ముందు ఏమైన వ్యాధులు ఉన్నాయా? అని ప్రశ్నించగా.. రోగి తనకు ఎలాంటి సమస్యలు లేవని సమధానమిచ్చాడు. రోగి బీపీ బీపీ కూడా లేదు. అదే సమయంలో.. ఈ రక్త స్రావం గుర్తించినప్పుడు కూడా బీజీ సాధారణ స్థితిలోనే ఉన్నట్లు తేలింది. ఇప్పటి వరకు ఇదే మొదటి కేసు కావడం ఆందోళన కలిగిస్తోందని డాక్టర్ గుప్తా తెలిపారు. ఎందుకంటే ప్రస్తుతం, మతపరమైన వేడుకులు, వివాహాలతో సహా ఇతర సందర్భాలలో బీజే, డప్పులు వాడకం పెరిగింది. ఇది మానవులకు చాలా హానికరంగా వైద్యులు గుర్తించారు.

READ MORE: Petrol Tanker: పెట్రోల్ ట్యాంకర్ బోల్తా.. 15 మంది మృతి, 40 మందికి గాయాలు..

ఆరోగ్యవంతమైన మానవుడు 70 డెసిబుల్స్ ధ్వని తీవ్రతను తట్టుకోగలడని డాక్టర్ గుప్తా చెప్పారు. కానీ దీని కంటే ఎక్కువగా సౌండ్ వింటే హానికరం మాత్రమే కాకుండా అతని చెవులు, మెదడుకు కూడా చాలా ప్రమాదమని తెలిపారు. డీజే నుంచి వచ్చే ధ్వని యొక్క తీవ్రత 150 డెసిబుల్స్ కంటే ఎక్కువగా ఉండటం వల్ల జైస్వాల్ కి ఈ పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. బాధితుడు డీజేలను అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తుంటాడని కుటుంబీకులు డాక్టర్‌కు తెలిపారు. ఆరోగ్యం క్షీణించిన రోజున డీజే వద్దే ఉన్నాడని చెప్పారు. అదే సమయంలో అతను వాంతులు, తల తిరగడం జరిగిందని తెలిపారు.

Exit mobile version