Pakistan: ఎన్నికల వేళ పాక్‌లో పేలుడు.. ముగ్గురి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో (Pakistan) సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది (Election Day). అయితే ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుందని అనుకుంటున్న సమయంలో బలూచిస్థాన్ (Balochistan), ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో రెండు చోట్ల పేలుళ్లు సంభవించాయి. బలూచిస్థాన్‌లో రోడ్డు పక్కనే దాడి జరిగినట్లు సమాచారం. ఈ పేలుడులో ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి చెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. ఇక ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఒక పోలీసు మరణించాడు.
పాకిస్థాన్ వ్యాప్తంగా 90 వేల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఓటింగ్ పూర్తవ్వగానే లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు.
Also Read
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
- Bhatti Vikramarka: "మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా".. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
- iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ఈ ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్, బిలావల్ భుట్టో నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ), ఇమ్రాన్‌ఖాన్ సారథ్యంలోని పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్(పీటీఐ) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. షరీఫ్‌కు చెందిన పీఎంఎల్ (ఎన్) ఈ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న ఆయన పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఓటు వేసినట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే ఎన్నికల ముందు రోజు బలూచిస్థాన్‌లో జరిగిన రెండు పేలుళ్లలో 30 మంది మృతిచెందగా.. 52 మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి:Sujana Chowdary: చంద్రబాబు-అమిత్ షా-జేపీ నడ్డా భేటీ.. సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
-
Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!