Blast in Dumping Yard: హైదరాబాద్‌లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్దనున్న జీహెచ్‌ఎంసీ డంపింగ్ యార్డులో పేలుడు జరిగింది. ఈ ఘటనలో కాగితాలు ఏరుకునే తండ్రీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం వారికి గాంధీ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుండగా.. కొడుకు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రతి డంపింగ్ యార్డులో తండ్రి చంద్రన్న(45), సురేశ్(14) చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్నారు. యథావిధిగా గురువారం చెత్త ఏరుతుండగా.. పెయింట్ డబ్బాలను కదిలించారు. దీంతో పేలుడు సంభవించి చంద్రన్న తలకు గాయంకాగా.. కుమారుడు సురేశ్‌కు చేయి విరిగింది.
Man Kills PhD Student: విద్యార్థిని హత్య చేసి.. మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికి..
పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. క్లూస్‌టీం అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించింది. పేలుడు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పెయింట్‌లో ఉండే టర్బెంట్ ఆయిల్‌తో పేలుడు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో కూడా భారీగా పెయింట్స్ డబ్బాలు ఉండటం పోలీసుల అనుమానాలకు బలం చేకూరుస్తుంది. పోలీసులు సంఘటనా స్థలాన్ని డాగ్‌స్క్వాడ్‌తో నిశితంగా పరిశీలించారు.
