తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. పిల్లలు.. తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ గడిపేది టీచర్లు, స్కూల్ వాతావరణంలోనే. పిల్లలు ప్రయోజకలు కావాలన్నా.. క్రమశిక్షణ నేర్చుకోవాలన్నా.. బడిలోనే సాధ్యమవుతుంది. ఒక విద్యార్థి పరిపూర్ణ మానవుడు అయ్యేది విద్యతోనే. అందుకు గురువు పాత్రే కీలకమైంది. విద్యలేని వాడు వింత పశువు అన్నారు పెద్దలు. విద్యతోనే జ్ఞానం వస్తుంది. ఇది ఎవరు కాదన్నా.. అవునన్నా నిజం. అందుకే స్థోమత లేకపోయినా.. అప్పులు చేసైనా పిల్లల్ని చదవిస్తుంటారు. అంటే చదువుకు అంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే.
విద్యార్థులకు టీచర్లు పాఠాలు బోధించడంతో పాటు క్రమశిక్షణ నేర్పిస్తుంటారు. ఒకప్పుడైతే బెత్తం ఉపయోగించేవారు. కానీ కాలక్రమేణా ఆ విధానానికి ఉపాధ్యాయులు స్వస్తి పలికారు. పిల్లల్ని కొడితే కొత్త కొత్త చట్టాలు రావడం.. శిక్షలు పడడంతో ఆ విధానాన్ని మానుకున్నారు.
ఇకపోతే ఒక్కో స్కూల్‌కి కొన్ని పద్ధతులు.. విధానాలు ఉంటాయి. ఆయా స్కూళ్లను బట్టి డ్రస్ కోడ్, షూ, టై, బెల్టు, హెయిర్‌స్టైల్ ఇలా వగేరా రూల్స్ ఉంటాయి. ఆ పద్ధతిలోనే విద్యార్థులు తయారై రావాల్సి ఉంటుంది. లేదంటే పాఠశాల కాంపౌండ్‌లోకి కూడా అడుగుపెట్టనివ్వరు. ఆడ పిల్లలైతే రెండు జడలు.. అబ్బాయిలైతే సైడ్ పాపిడి ఉంటుంది. లేదంటే ఆయా స్కూళ్ల పద్ధతులను బట్టి ఉంటుంది.
అయితే అమెరికాలో నల్లజాతికి చెందిన డారిల్ జార్జ్(18) స్కూల్ విద్యార్థి (Darryl George).. పాఠశాల విధానానికి విరుద్ధంగా వెరైటీ హెయిర్‌స్టైల్‌తో స్కూల్‌కి రావడంతో యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. తలపై పిన్లు వేసుకుని.. చిన్న చిన్న జడలు వేసుకుని ఒక డిఫరెంట్‌గా స్కూల్‌కు వచ్చాడు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించింది. కానీ అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో స్కూల్ నుంచి సస్పెండ్ చేసింది. జార్జ్‌కి టెక్సాస్ స్కూల్ డిస్ట్రిక్ట్ నెలల తరబడి శిక్ష విధించింది.
దీంతో ఆ విద్యార్థి స్కూల్ యాజమాన్యం తీరుపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. స్కూల్ యాజమాన్యం తీసుకున్న క్రమశిక్షణా చర్యను న్యాయమూర్తి సమర్థించారు. దీంతో ఆ విద్యార్థి ఖంగుతిన్నాడు. అక్కడినే కుప్పకూలి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కోర్టు తీర్పుతో తీవ్ర ఆవేదనతో బయటకు వెళ్లిపోయాడు.
గత ఆగస్టులో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటి నుంచి అతడికి సహ విద్యార్థులతో సంబంధం లేదు. మరోవైపు విద్యకు కూడా దూరం అయ్యాడు. అతడి యొక్క విపరీతమైన ప్రవర్తనతో చదువుకు దూరం కావాల్సి వచ్చింది.
విద్యార్థి హెయిర్ స్టైల్, డ్రెస్ కోడ్, అతడి జుట్టు.. ప్రవర్తన సరిగ్గా లేనందునే పాఠశాల నుంచి బయటకు పంపించినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే జార్జ్ తరపున న్యాయవాదులు స్కూల్ యాజమాన్యం తీరును తీవ్రంగా తప్పుపట్టారు. హెయిర్‌స్టైల్ విషయంలో స్టూడెంట్స్‌ను సస్పెండ్ చేయడం కరెక్ట్ కాదని వాదించారు. పై కోర్టుకు వెళ్తామని జార్జ్ లాయర్లు తెలిపారు.