NTV Telugu Site icon

Black Color Car: బ్లాక్ కలర్ కారుని కొనుగోలు చేయాలనుకుంటున్నారా?.. ఈ నాలుగు విషయాలు గుర్తుంచుకోండి!

Black Color Car

Black Color Car

Do You Know Top 4 Disadvantages of Black Color Car Buying: ‘బ్లాక్ కలర్’ను చాలా మంది ఇష్టపడుతారు. వేసుకునే దుస్తువులు, ఇంట్లో ఉండే వస్తువులు, ఉపయోగించే కార్లు లాంటివి బ్లాక్ కలర్‌లో ఉండేలా కొందరు చూసుకుంటారు. బ్లాక్ కలర్ కార్లు చూడటానికి బాగానే ఉన్నా.. చాలా సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కారు విషయంలో. మీరు బ్లాక్ కలర్ కారు కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. కాస్త ఆలోచిస్తే మంచిది. ఎందుకంటే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. బ్లాక్ కలర్ కార్లకు సంబంధించిన 4 సమస్యలు ఏవో ఓసారి చూద్దాం.

ప్రమాదాలు ఎక్కువ:
నలుపు రంగు కార్లకు విజిబిలిటీ తక్కువ. ముఖ్యంగా రాత్రి లేదా తక్కువ కాంతి ఉన్నపుడు బ్లాక్ కలర్ కార్లు ఇతరులకు తక్కువగా కనిపిస్తాయి. దీంతో ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది.

వేడి:
లేత రంగు కార్ల కంటే నలుపు రంగు కార్లు వేసవిలో ఎక్కువ వేడిని గ్రహిస్తాయి. దీని కారణంగా బ్లాక్ కలర్ కార్ల లోపలి భాగం వేడిగా ఉంటుంది. ఇక కారును ఎండలో పార్క్ చేస్తే.. వేడి తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. కారును చల్లబరచడానికి ఎక్కువ ఏసీ అవసరం అవుతుంది.

Also Read: Maruti Brezza Price 2023: రూ. 5 లక్షలకే మారుతి బ్రెజా.. పూర్తి వివరాలు ఇవే!

మెయింటెనెన్స్:
నలుపు రంగు కార్లకు మెయింటెనెన్స్ మరియు కేర్ ఎక్కువ అవసరమవుతాయి. పెయింట్‌ వర్క్ మెరుపును కాపాడుకోవడానికి రెగ్యులర్ వాషింగ్, పాలిషింగ్ మరియు వాక్సింగ్ అవసరం అవుతాయి. కారును కడిగిన తర్వాత కూడా మరకలు ఉంటాయి. శుభ్రపరిచేటప్పుడు వీటిని తొలగించడానికి అదనపు జాగ్రత్త అవసరం.

దుమ్ము మరియు గీతలు:
నలుపు రంగులో ఉన్న కార్లపై ధూళి, దుమ్ము మరియు గీతలు సులభంగా కనిపిస్తాయి. దాంతో నలుపు రంగు కారును శుభ్రంగా ఉంచడం కష్టంగా ఉంటుంది. అప్పుడు మీరు తరచుగా కారును కడగడం మరియు శుభ్రం చేయడం అవసరం అవుతుంది. అంతేకాదు చిన్న గీతలు కూడా స్పష్టంగా కనిపిస్తాయి. అప్పుడు స్క్రాచ్ తొలగింపు ఖర్చు మరింత ఎక్కువ అవుతుంది.

Also Read: MS Dhoni Birthday: భారత సైన్యంలో మంచి పొజిషన్.. ఎంఎస్ ధోనీ ఆర్మీ జర్నీ గురించి తెలుసా?