Rammohan Naidu : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం యావత్ ప్రపంచాన్ని కలిచివేసింది. ఇండియన్ ఫ్లైట్ యాక్సిడెంట్ లోనే అత్యంత ప్రమాదకరమైనదిగా దీన్ని చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకునే బ్లాక్ బాక్స్ విచారణ మీదనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఈ బ్లాక్ బాక్స్ ను విదేశాలకు తరలించి అక్కడ విచారణ జరిపిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
Read Also : Kannappa : కన్నప్పకు అదే అతిపెద్ద సమస్య..?
దీనిపై కేంద్ర విమానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. అవన్నీ ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేశారు. ఫిక్కీ, కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పుణెలో జరిగిన హెలికాఫ్టర్స్ అండ్ స్మాల్ ఎయిర్‌క్రాఫ్ట్స్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
బ్లాక్ బాక్స్ ను విదేశాలకు తరలించలేదు. ఇండియాలోనే ఉంది. దీన్ని ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పరిశీలిస్తోంది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక బ్లాక్ బాక్స్ విచారణలో ఎలాంటి నిజాలు తెలుస్తాయా అని అంతా వెయిట్ చేస్తున్నారు.
Read Also : Supreme Court : ‘ఆపరేషన్ సింధూర్’ లో పాల్గొంటే కేసు నుంచి రక్షణ ఇవ్వాలా..?
