బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అవకాశం దొరికనప్పుడల్లా పాక్ పై విరుచుకుపడుతూ పాక్ సైనికులను అంతమొందిస్తుంది. పాక్ లోని పలు నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతోంది బీఎల్ఏ. తాజాగా మరో నగరాన్ని స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని సురబ్ జిల్లాను అక్కడి బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) సాయుధ యోధులు నగరాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Also Read:YS Jagan Fan: అరగుండు గీయించుకున్న జగన్ వీరాభిమాని.. ఎందుకంటే..?
BLA సభ్యులు స్థానిక లెవీస్ స్టేషన్, పోలీస్ స్టేషన్, ఒక బ్యాంకును స్వాధీనం చేసుకున్నారు. పెద్ద సంఖ్యలో సాయుధ యోధులు సురబ్ నగరంలోని కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. క్వెట్టా-కరాచీ, సురబ్-ఘిదర్ హైవేలపై సోదాలు చేపట్టారు. పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారింది. ఆ ప్రాంతంతో సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం లేదా భద్రతా సంస్థల నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
BLA ప్రతినిధి జియాంద్ బలోచ్ ఒక ప్రకటనలో తమ యోధులు సురబ్ పట్టణాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. స్థానిక బ్యాంకులు, లెవీలు, పోలీస్ స్టేషన్లు ఇప్పుడు తమ నియంత్రణలో ఉన్నాయని ఆయన తెలిపారు. అదనపు డిప్యూటీ కమిషనర్ (ADC) హిదాయత్ ఉల్లా ఊపిరాడక మరణించారు. సాయుధ దుండగులు అతన్ని ఒక గదిలో బంధించారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
