మోడీ భారీ బహిరంగ సభ అనంతరం రాజకీయాల్లో పలు మార్పులకు నాందిగా మారిందన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం ప్రోటోకాల్ కూడా పాటించలేదని, కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని, ఆయనకు బదులు మంత్రులను పంపించారన్నారు. అవినీతికి కేరాఫ్ గా కేసీఆర్ మారారని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా.. ‘టీఎస్పీఎస్సీ లీకేజీపై కూడా కేసీఆర్ కనీసం నోరు మెదపలేదని, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని పరీక్షలు లీక్ అయినట్లుగా అందరూ భావిస్తున్నారని, ఉద్యమంలో తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటే.. నేడు స్వరాష్ట్రంలో నోటిఫికేషన్లు రావని ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదో తరగతి పేపర్ లికేజీలో కావాలని బండి సంజయ్ ని ఇరికించారు. న్యాయస్థానం మొట్టికాయలు వేస్తే కానీ సర్కారు తీరు మారట్లేదు. జైల్లో వేసినా, తూటాలు దించినా నిరుద్యోగుల తరుపున పోరాడుతాం. టెన్త్ పేపర్ లీకేజీలో ఉన్నది మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కవిత లిక్కర్ స్కామ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాన్ని దృష్టి మళ్లించడానికే.. బండి పై లేనిపోని ఆరోపణలు. సోమవారం నుంచి కోచింగ్ సెంటర్లు, యూనివర్సిటీలు, కాలేజీలకు వెళ్లి bjym ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపడుతున్నాం.’ అని ఆయన అన్నారు.
Also Read : Madhya Pradesh: అన్నా చెల్లెల క్యారెక్టర్‌పై అనుమానం.. చెట్టుకు కట్టేసి అమానుషం..
అనంతరం.. గిరిజన మోర్చా అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ.. ‘బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో పోతోంది. అది కేవలం బిజినెస్ కోసమే.. డబ్బు సంపాదించుకునేందుకు మాత్రమే. గిరిజన రిజర్వేషన్లు పెంచలేదు. పిసా చట్టం అమలు అంటాడు.. పోడు పట్టాలు ఇస్తామని మోసం చేశాడు. గిరిజన ఎమ్మెల్యేలు, మంత్రులు గొర్రెల లాగా మారారు. ఇప్పుడు 10 వేలు ఇస్తే 24 గంటలు వైన్స్ ఓపెన్ చేసుకునేందుకు జీవో ఇచ్చావు. తాగుబోతుల తెలంగాణగా మార్చావు.’ అని అన్నారు.
Also Read : Mosquito Liquid: విషాదం.. మస్కిటో లిక్విడ్ తాగి ఏడాదిన్నర బాలుడు మృతి
