Site icon NTV Telugu

Uddhav Thackeray: బీజేపీ హిందుత్వానికి.. మా హిందుత్వానికి తేడా ఇదే..!

Uddav

Uddav

శివసేన (యూబీటీ) అధ్యక్షుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది. తమ హిందుత్వానికి, బీజేపీ హిందుత్వానికి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొనింది. మా హిందుత్వం ఇంట్లో పొయ్యిలు వెలిగిస్తుంటే.. కమలం పార్టీ హిందుత్వం మాత్రం ఇళ్లను తగలబెడుతోందని ఆయన ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో జరిగిన ఓ ఎన్నికల ప్రచార సభలో ఠాక్రే మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంగా నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా పని చేస్తున్నారు.. ముస్లిం జనాభా పెరగడం ఆయన విజయమా, వైఫల్యమా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ముస్లింల జనాభా పెరుగుదలపై మోడీని అభినందించాలా, విమర్శించాలా అనే దానిపై అయోమయం నెలకుందని ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు.

Read Also: Samyuktha Menon : ఆ విషయంలో మలయాళీ సినిమానే సౌకర్యంగా ఉంటుంది..

అయితే, మోడీ ప్రభుత్వం శివసేన పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్‌ను ఉపయోగించుకుని.. మా పార్టీ విల్లు, బాణం గుర్తును లాక్కుంది అని ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. మా పార్టీని, చిహ్నాన్ని, మనుషులను అన్యాయంగా లాగేసుకున్నారు.. అయినప్పటికీ మాకు ఇప్పటికి బీజేపీ భయపడుతుందని ఠాక్రే అన్నారు. అలాగే, ప్రధాని మోడీ న్యాయవ్యవస్థపై కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన విమర్శలు కురిపించారు. మోడీ డ్రామా కేవలం జూన్ 4వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఇప్పటికైనా హిందువులు- ముస్లింల పేరుతో రాజకీయాలు చేయడం కాషాయ పార్టీ మానుకోవాలని సూచించారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడే భాష సరిగ్గా లేదని.. దాని వల్ల దేశానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉందని శివసేన ( యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

Exit mobile version