NTV Telugu Site icon

Maheshwar Reddy : ఇప్పుడు లోలోపల సెటిల్మెంట్ లు బయటకు వస్తున్నాయి

Maheshwar Reddy

Maheshwar Reddy

అవినీతి, అరాచకాలు గత ప్రభుత్వం లో జరిగిన దానికన్నా ఎక్కువ జరుగుతున్నవన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడ్డ వారిని కటకటాల వెనక్కి పంపిస్తా అన్న ముఖ్యమంత్రి.. ఇప్పుడు లోలోపల సెటిల్మెంట్ లు బయటకు వస్తున్నాయన్నారు. రేవంత్ అంటే నా వంతు ఎంత అని అడుగుతున్నాడు ఆట అని, రేటెంత రెడ్డి నీ రేట్ ఎంతా అని వెళ్లిన వారు అడుగుతున్నారు అట… అని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం లో జరిగిన అవినీతి నీ ముందు పెట్టుకొని సెటిల్మెంట్ చేసుకుంటున్నాడని ఆయన విమర్శించారు. 15 ఎకరాలు గత ప్రభుత్వం హేటిరో డ్రగ్స్ కి ఇచ్చింది… 15 వందల కోట్ల విలువైన భూమి అని, ఈ ప్రభుత్వం ఆ కేటాయింపు ను రద్దు చేసింది… అది ప్రభుత్వ స్థలం గా బోర్డు పెట్టిందన్నారు మహేశ్వర్‌ రెడ్డి.

 Geethanjali Malli Vachindi Movie Review: గీతాంజలి మళ్లీ వచ్చింది రివ్యూ

ఏమైందో తెలియదు జీఓ 37 ద్వారా అదే భూమి నీ మళ్ళీ హీటిరో కు(పార్థ సారథి రెడ్డి) రేవంత్ రెడ్ది ఇచ్చారన్నారు. 300 కోట్లను తీసుకొని డిల్లీకి పంపించిన మాట వాస్తవమా కాదా అని ఆయన ప్రశ్నించారు. సుడో ప్రభుత్వం నీ తన మనషులను పెట్టుకొని రేవంత్ రెడ్డి నడిపిస్తున్నారని, రేవంత్ రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డీ ఇంటికి పోయే సరికి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అభద్రతా భావం తో రేవంత్ నీ పొగుడుతున్నారు… తన మంత్రి పదవి పోతుందేమో నని భయపడుతున్నారని, షిండే లు లేకపోతే రేవంత్ రెడ్డి నా వెనుక కుట్ర జరుగుతుంది అని ఎందుకు అన్నాడన్నారు మహేశ్వర్ రెడ్ది

 Rajnath Singh: పాక్‌కు చేతకాని పక్షంలో ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు భారత్‌ సిద్ధం..