NTV Telugu Site icon

Ashok Gehlot: వారికి రెచ్చగొట్టడమే తెలుసు.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయం

Ashok Gehlot

Ashok Gehlot

త్వరలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. గడిచిన ఐదేళ్ళలో మా ప్రభుత్వం అనుసరించిన విధానాలు, మేము చేసిన అభివృద్ధిని మాత్రమే ప్రజలు తీసుకుంటారు.. అంతేగానీ ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే వారు తిప్పికొడతారు అని అన్నారు.. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తుందని బీజేపీ ఓడిపోవడం ఖాయమని అన్నారు.

Read Also : UP : అల్లుడికి మామ 3 కండీషన్లు.. భయపడుతున్న పెళ్లికాని ప్రసాదులు

మతసామరస్యాన్ని దెబ్బతీయడం తప్ప బీజేపీ చేయగలిగింది ఏమీ లేదు అని రాజస్థాన్ సీఎం ఆశోక్ గెహ్లాట్ అన్నారు. కర్ణాటకలో కూడా అదే తంత్రాన్ని ప్రయోగించారు. కానీ అక్కడ వారి ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది..నిన్న అక్కడ జరిగిందే రేపు ఇక్కడ కూడా జరుగుతుంది అని. వారు గెలవడానికి మతసామరస్యాన్ని దెబ్బతీయడం తప్ప మరో మార్గాన్ని ఎంచుకుంటారని నేననుకోవడం లేదు అని సీఎం ఆశోక్ గెహ్లాట్ అన్నారు.

Read Also : Nellore Politics: నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు

ప్రచారానికి ప్రధాన మంత్రి మోడీ వచ్చినా అమిత్ షా వచ్చినా వాళ్ళు మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రసంగాలే చేస్తారు.. దాని వల్ల వారికి ఒరిగే ప్రయోజనమేమీ.. కర్ణాటక ఎన్నికల సమయంలో వారు బజరంగ్ బలి నినాదాలు చేశారు..అయినా కూడా అక్కడ బీజేపీ పార్టీ ఓడిపోయింది.. ఈ సందర్భంగా నేనప్పుడే ప్రధాన మంత్రి ప్రచారాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్‌కు కూడా విజ్ఞప్తి చేశానని రాజస్థాన్ సీఎం.

Read Also : Shanvi Srivastava : కిల్లింగ్ లుక్స్ తో రెచ్చగొడుతున్న శాన్వీ..!!

రేపు రాజస్థాన్ లో జరగబోయే ఎన్నికల్లో కూడా బీజేపీ ఇదే తరహా ప్రచారానికి తెరతీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అశోక్ గెహ్లాట్ అన్నారు. అది వారి నైజం..కానీ ఇక్కడి ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితి లేరన్నారు. గడిచిన ఐదేళ్ళలో ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఆడబిడ్డల సంక్షేమం, విద్య, వైద్యం, మంచినీటి సౌకర్యాలకు పెద్దపీట వేస్తూ మేము అవలంబించిన విధానాలే మమ్మల్ని గెలిపిస్తాయని ఆశోక్ గెహ్లాట్ వ్యాఖ్యనించారు.

Read Also : Air India Flight: సాంకేతిక లోపంతో శాన్ ఫ్రాన్సిస్కో-ముంబై విమానం రద్దు

రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే వంటి ముఖ్య నేతల సమక్షంలో తనకూ సచిన్ పైలట్ కు మధ్య విభేదాల గురించి ప్రస్తావించాం.. అక్కడే మేము మాట్లాడుకున్నాం.. అది పూర్తిగా మా అంతర్గత వ్యవహారం అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు.. దాని గురించి ఇప్పుడు మాట్లాడిన అనవసర వివాదాలకు తావివ్వకూడదని నేను అనుకుంటున్నానని ఆయన అన్నారు.