BJP Women Leader DK Aruna Fires on CM KCR
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్‌ఎస్ అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. రానున్న దసరాలోపే జాతీయ పార్టీని ప్రకటించనున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు అంటున్న నేపథ్యంలో.. తాజాగా నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమయ్యాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై చర్చ జరిగింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు స్పందిస్తూ.. బీజేపీ పేరు తలవనిదే కేసీఆర్‌కు నిద్ర రాని పరిస్థితి ఉందని ఆమె విమర్శించారు. అంతేకాకుండా.. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గొంతు చించుకుంటున్నాడని, ప్రపంచంలోనే ఝూట అవార్డ్ ఇవ్వాలంటే అది కేసీఆర్ కే ఇవ్వాలి అంటూ ఆమె మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా కేసీఆర్ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని, మా ఎమ్మెల్యేలను 3 తోకలు అంటావా?.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే… మా ముగ్గురు ఎమ్మెల్యేలను ఎందుకు అసెంబ్లీ నుంచి బయటికి పంపించావ్.. కేసీఆర్ చెప్పేవన్ని ఝూటా మాటలే.. కేసీఆర్ వి అన్నీ పచ్చి అబద్దాలే.. ఎక్కడ ఎలక్షన్ వస్తే… అక్కడ కరెంట్ మీటర్లు అంటాడు.. దుబ్బాక, హుజురాబాద్ ఎలక్షన్స్ లో ప్రజలు బుద్ది చెప్పినా.. కేసీఆర్ కు సిగ్గు రాలేదు.. ప్రజలు బీజేపీ కి ఓటు వేసి, కేసీఆర్ కే మీటర్లు పెట్టారు..
తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే, జాతీయ పార్టీ అంటూ… ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు.. రియల్ ఎస్టేట్ పేరుతో దండుకుంటున్నారు.. కాళేశ్వరం పేరుతో కోట్ల అవినీతికి పాల్పడ్డారు.. నియంత పాలనను బీజేపీ అంతం చేస్తుంది.. తెలంగాణ ప్రజల ఆకాంక్షను బీజేపీ నెరవేరుస్తుంది.. కేంద్ర మంత్రులు నూకలు తినమన్నారని, ధగాకోరు మాటలు మాట్లాడుతున్నారు కేసీఆర్, కేటీఆర్.. తెలంగాణ లో బీజేపీ బలోపేతం అయింది.. భారత్ జోడో కాదు.. ముందు రాహుల్ గాంధీ తన పార్టీ ని జోడో చేసుకోవాలి.. మోదీ పాలనలో భారత్ చాలా బాగుంది.. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కార్యకర్తలు ఎలా గెలిపించుకున్నారో… మునుగోడు ఎన్నికలో కూడా రాజగోపాల్ రెడ్డిని అలానే గెలిపించాలని విజ్ఞప్తి అని ఆమె వ్యాఖ్యానించారు.
