కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కొందరు నేతలు ( సచిన్ పైలట్ ) పగటి కలలు కంటున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. రాజస్ధాన్‌లో కూడా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పైలట్ అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ చత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్, రాజస్ధాన్ సహా పలు ఇతర రాష్ట్రాల్లో తుడిచి పెట్టుకుపోయిందని చెప్పుకొచ్చారు. బీజేపీ 400కి పైగా ఎంపీ స్థానాలు సాధిస్తుందన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 స్థానాలు గెలుచుకోవడం కూడా కష్టమేనని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు.
Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్ కీలక ప్రకటన.. రష్యన్ బాంబర్‌ను ఏం చేసిందంటే..!
ఇక, ఓటమి తప్పదని తెలిసే కాంగ్రెస్ పార్టీ బ్యాలెట్ పేపర్‌పై ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తుందని అనురాగ్ ఠాకూర్ చెప్పారు. బ్యాలెట్ పేపర్ వాడిన రోజుల్లో పోలింగ్ బూత్‌లను లూటీ చేసే వారన్నారు. బ్యాలెట్ పేపర్లపై తప్పుడు మార్కింగ్ చేసేవారని పలు అక్రమాలు జరిగేవని ఆయన గుర్తు చేశారు. కానీ ఇవాళ ఈవీఎంల కారణంగా ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో చేయలేనిది.. బీజేపీ కేవలం పదేళ్లలో దేశ ప్రజలకు అనేక సేవలందించామని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పుకొచ్చారు.