Site icon NTV Telugu

Sanjay Singh: ఈసారి ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం బీజేపీలో కనిపిస్తుంది..

Sanjay Singh

Sanjay Singh

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రాణాలకు ముప్పు ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ సంజయ్ సింగ్ మరోసారి ఆరోపణలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తీహార్‌లో అన్ని నిబంధనలు విస్మరించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఖైదీలను హత్య చేసి వారి తలలు పగులగొట్టే జైల్లో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భద్రతకు విఘాతం కలుగుతోందన్నారు. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌ను కూడా జైలులో కలవకుండా కుట్ర పూరితంగా నిషేధం విధించారని వెల్లడించారు.

Read Also: Telugu Movies : ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..

ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ రాజీనామా కూటమిపై ఎలాంటి ప్రభావం చూపుతుందని మీడియా ప్రశ్నించగా.. ఎలాంటి ప్రభావం ఉండదని, ఈసారి ప్రజలు మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో ఓటు వేస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. అలాగే, ఈ సంద‌ర్భంగా ఆప్ నేత దిలీప్ పాండే మాట్లాడుతూ.. ఎన్నిక‌ల‌లో ఓడిపోతామ‌నే భ‌యం బీజేపీకి పట్టుకుందన్నారు. ఏ పార్టీ ప్రచారాన్ని ఆపేయ‌డం ఎప్పుడూ జ‌ర‌గ‌లేద‌న్నారు. అయితే, బీజేపీ పిలుపుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రచార గీతం నిషేధించబడిందని ఆయన తెలిపారు.

Exit mobile version