Telugu Movies : ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి నెల ఎన్నో సినిమాలు విడుదల అవుతుంటాయి.. ఈ వారం కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉంది.. ఈ వారంలో థియేటర్లలో సస్పెన్స్ మూవీస్ ఎక్కువగా విడుదల అవుతున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటో ఒకసారి చూసేద్దాం..
ఆ ఒక్కటీ అడక్కు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఆ ఒక్కటీ అడక్కు..బ్యాక్ టు హోమ్ గ్రౌండ్ అన్నట్టు అల్లరోడు ఈజ్ బ్యాక్ విత్ కామెడీ అన్నమాట. అబ్బాయిల పెళ్లి కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. మే 3 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..
శబరి..
వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్ లో వస్తున్న శబరి.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. తల్లి కుమార్తెల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కింది. కుమార్తెను రక్షించుకోవడం కోసం ఓ తల్లి ఎంత దూరం వెళ్లింది? అనేది సినిమా కథ.. ఈ సినిమా కూడా మే 3 న విడుదల కాబోతుంది..
బాక్..
తమన్నా, రాశి ఖన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా బాక్.. సుందర్ సి హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘అరణ్మణై 4’కు తెలుగు డబ్బింగ్ ఇది.. కామెడీ, సస్పెన్స్ మూవీగా రాబోతుంది.. ఈ సినిమా కూడా మే 3 రిలీజ్ కాబోతుంది.
ప్రసన్నవదనం..
కలర్ ఫోటో ఫెమ్ సుహాస్ హీరోగా నటిస్తున్న సినిమా ప్రసన్నవదనం.. సుకుమార్ శిష్యుడు అర్జున్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా మే 3 థియేటర్లలోకి రాబోతుంది..
అలాగే మే 1 న వకీల్ సాబ్ సినిమా రీ రిలీజ్ కాబోతుంది.. దీంతో పాటుగా మరికొన్ని చిన్న సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..