BJP Parliamentary Board Meeting: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలను ముమ్మరం చేసింది. సెప్టెంబర్ 9న జరగనున్న ఎన్నికలకు పార్టీ తరుఫున పోటీ చేయనున్న అభ్యర్థి పేరును నిర్ణయించే ప్రక్రియను ప్రారంభించింది. ఆదివారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. కాషాయ దళం నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా, బీహార్ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ నారాయణ్ సింగ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
READ MORE: APPAR ID: CBSE కీలక నిర్ణయం.. ఇకపై విద్యార్థులకు ఆ ఐడి లేనట్లయితే బోర్డు పరీక్షలు రాయలేరు!
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సిక్కిం గవర్నర్ ఓం మాథుర్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా పోటీలో ఉన్నట్లు సమాచారం. వీళ్లే కాకుండా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సిద్ధాంతకర్త శేషాద్రి చారి పేరు కూడా వినిపిస్తుంది. బీహార్‌లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌ను అభ్యర్థిగా ఖరారు చేస్తారని భావిస్తున్నారు.
ప్రధానమంత్రిని కలిసిన పలువురు గవర్నర్లు..
గత ఒక నెలలో చాలా మంది గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలిశారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సమయంలో
ఈ సమావేశాలకు ప్రత్యేకత ఏర్పడింది. సంఖ్యా పరంగా ఈ ఎన్నికల్లో బీజేపీ -ఎన్డీఏ కూటమీ పెద్ద సవాలును ఎదుర్కొంటున్నట్లు కనిపించడం లేదు. ఉపరాష్ట్రపతిని లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు రెండింటి ద్వారా ఎన్నుకుంటారు. రాజ్యసభ నామినేటెడ్ సభ్యులు కూడా ఎన్నికలో ఓటు వేస్తారు. ఈ రెండు సభలలో ఎన్డీఏకు మెజారిటీ ఉండటంతో, ఏ అవకాశాన్ని కూడా కాషాయ దళం వదులుకోడానికి ఇష్టపడటం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ముగిసిన తర్వాత అభ్యర్థి ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జూలై 21న ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. ఆయన తన ఆరోగ్య కారణాలను చూపి రాజీనామా చేసినట్లు చాలా కథనాలు వచ్చాయి. అయితే ఆయనకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు తీవ్రమవుతున్నాయని, ఆగస్టు 2027 వరకు ఆయన పదవీకాలం ఉన్నా కూడా ధన్‌ఖడ్ పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో బలమైన చర్చ జరుగుతోంది.
READ MORE: Rajini Kanth : పవన్ కల్యాణ్ పొలిటికల్ తుఫాన్.. రజినీకాంత్ ట్వీట్
