Site icon NTV Telugu

YSRCP: వైసీపీ గూటికి బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం జగన్‌..

Ysrcp

Ysrcp

YSRCP: ఓ వైపు మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారం ఉధృతం చేసిన వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మరోవైపు ఇతర పార్టీలకు చెందిన నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.. వైసీపీ కండువా కప్పి.. ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం పనిచేయాలని దిశానిర్ధేశం చేస్తున్నారు.. ఇక, విశాఖపట్నం జిల్లా ఎండాడ ఎంవీవీ సిటీ నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో మరికొందరు ఇతర పార్టీల నేతలను వైసీపీ గూటికి చేరారు.. భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు పలువురు నేతలు.. భారతీయ జనతాపార్టీ గాజువాక నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ మేయర్ పులుసు జనార్ధనరావు, 65వ వార్డు అధ్యక్షుడు వీఎస్ ప్రకాష్ రావు, ఉపాధ్యక్షుడు కర్రి గోవింద్, కార్యదర్శి గొల్లపల్లి గోవింద్, వరప్రసాదరెడ్డి, సంపత్ కుమార్.. ఇక, టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు యువజన విభాగం నేత ఏఎన్ఆర్.. వైసీపీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ కార్యక్రమంలో మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమర్నాథ్ సహా పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Read Also: AAP: హనుమంతుడి చేతిలో ఇన్సులిన్‌ పెట్టి శోభాయాత్ర.. ఆప్‌ తీరుపై నెటిజన్లు ఫైర్

Exit mobile version