NTV Telugu Site icon

Lok sabha election: కమలానికి తొలి విజయం.. ఎక్స్‌లో బీజేపీ కీలక ప్రకటన

Victory

Victory

ఓ వైపు దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతుండగానే గుజరాత్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొత్తం రాష్ట్రంలో 26 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో సూరత్ ఒకటి. ఈ నియోజకవర్గానికి మూడో ఫేజ్‌లో అనగా మే 7న పోలింగ్ జరగనుంది. కానీ ఇంతలోనే బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ విజయం సాధించినట్లుగా ఎక్స్‌ ట్విట్టర్‌లో ఆ రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. ఆయనను బీజేపీ నేతలు అభినందనలతో ముంచెత్తున్నారు.

సూరత్‌లో మే 7న ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే నామినేషన్ల పరిశీలనలోనే కాంగ్రెస్ అభ్యర్థిపై అనర్హత వేటు పడింది. దీంతో ఆయన పోటీలో నుంచి వైదొలగారు. మిగతా ఇండిపెండెంట్లు కూడా బరి నుంచి తప్పుకున్నారు. స్వతంత్రులు నామినేషన్లు ఉపసహరించుకున్నారు. దీంతో సూరత్‌లో బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ మాత్రమే బరిలో ఉన్నారు. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సూరత్ బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ విజయం సాధించారని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ సీఆర్ పాటిల్ ఎక్స్‌లో పోస్టు చేశారు. 2024లో మోడీ తిరిగి ప్రధాని అయ్యేందుకు బీజేపీ ఖాతాలో సూరత్ తొలి విజయం అందుకుందని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: రేపే పిఠాపురంలో జనసేనాని నామినేషన్..

సూరత్ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలేష్‌ కుంభానీ నామినేషన్‌ పత్రాలను ఆదివారం జిల్లా రిటర్నింగ్‌ అధికారి సౌరభ్‌ పర్ఘీ తిరస్కరించారు. నామినేషన్ పత్రాల్లో సంతకాలు సరిగ్గా లేవని నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇక సూరత్ నుంచి కాంగ్రెస్ ప్రత్యామ్నాయ అభ్యర్థిగా ఉన్న సురేష్ పడసాల నామినేషన్ ఫారం కూడా తిరస్కరణకు గురైంది. ఆయన నామినేషన్ పత్రం కూడా చెల్లదని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. విచిత్రమేంటంటే స్వతంత్రులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులందరూ తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి ఒక్కరే బరిలో ఉండడంతో ఆయనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఖాతాలో సూరత్ తొలి సీటు సాధించిందని బీజేపీ సంబరాలు చేసుకుంటుంది. ఇక మే 7న సూరత్‌లో పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు.

ఇది కూడా చదవండి: Satyabhama: కాజల్ అగర్వాల్ కి కొత్త బిరుదు.. ఆరోజే రిలీజ్!!

తమ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురి కావడంపై కాంగ్రెస్ మండిపడుతోంది. ఉద్దేశపూర్వకంగానే తమ నామినేషన్లకు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని ధ్వజమెత్తుతున్నారు. దీనిపై హైకోర్టు, సుప్రీంకోర్టులకు వెళ్తామని కాంగ్రెస్ తరపు న్యాయవాది బాబు మంగూకియా తెలిపారు.

సూరత్ పరిణామాలను చూస్తుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉందన్న సంగతి అర్థమవుతుందని ఎక్స్‌లో జైరాం రమేష్ పోస్టు చేశారు. ప్రజాస్వామ్యానికి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి ముప్పు పొంచి ఉందని జైరాం రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. సెకండ్ విడత శుక్రవారం జరగనుంది. అనంతరం మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఇంకా ఆరు విడతల పోలింగ్ ముగియక ముందే సూరత్‌లో విజయం సాధించినట్లుగా బీజేపీ ప్రకటించింది. గతంలో చండీగఢ్ మేయర్ ఎన్నిక సందర్భంగా అక్కడి రిటర్నింగ్ అధికారి చేసిన జిమ్మిక్కులతో బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటించారు. అనంతరం ఆప్, కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. రిటర్నింగ్ అధికారికి చీవాట్లు పెట్టి.. అనంతరం ఆప్ అభ్యర్థి విజయం సాధించినట్లు న్యాయస్థానం తీర్పు వెలువరించింది. తాజాగా సూరత్‌లో బీజేపీ విజయంపై న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.