NTV Telugu Site icon

Kishan Reddy: తెలంగాణ ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

Kishan Reddy

Kishan Reddy

తెలంగాణ ప్రజలకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. దశాబ్దాల పోరాటం, నీళ్లు – నిధులు – నియామకాల కోసం 369 మంది విద్యార్థుల బలిదానం, మలిదశ ఉద్యమంలో మనకళ్లముందే 1200 మంది ఆత్మబలిదానం, చిన్న నుంచి పెద్ద వరకు, సకల జనులంతా ఏకమై.. నాలుగుకోట్ల తెలంగాణ గొంతుకలు ఏకమై నినదిస్తే, ఎన్నో త్యాగాలు చేస్తే మన తెలంగాణ సాధ్యమైందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇది ఏ ఒక్క వ్యక్తి ద్వారానో.. లేక ఒక కుటుంబ త్యాగం వల్ల రాలేదనే విషయం మనందరికీ తెలుసన్నారు. ఇంతటి సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. ఉద్యమ ఆకాంక్షలను చేరుకుందా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానాన్ని తెలంగాణ ప్రజలు తమ గుండెమీద చేయివేసుకుని చెప్పుకోవాలన్నారు. ఉద్యమ నినాదమైన ‘నీళ్లు, నిధులు, నియామకాల’ లక్ష్యాలను చేరుకోవడంలో.. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం సంపూర్తిగా విఫలమైంది.. మిగులు బడ్జెట్, పుష్కలమైన వనరులతో ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న రాష్ట్రం.. పదేళ్లలో ఆర్థిక నిర్వహణ సరిగ్గా లేక.. తీవ్ర ఇబ్బందుల పాలైందని ఆరోపించారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ పాలనాపరమైన అసమర్థత కళ్లకు కొట్టొచ్చినట్లు కనబడుతోందని విమర్శించారు. గ్రామ పంచాయతీల నుంచి రాష్ట్ర రాజధాని వరకు ఎక్కడికక్కడ సమస్యలు తిష్టవేసుకుని కూర్చున్నాయని లేఖలో పేర్కొన్నారు.

Sonia Gandhi: కాంగ్రెస్‌కు ఓటు వేయండి.. తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సందేశం

తెలంగాణ రాష్ట్ర సాధనలో నీటి కేటాయింపులో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి నినదించాం. కానీ రాష్ట్రం వచ్చాక ఈ ‘నీళ్ల’ పేరుతో.. కేసీఆర్ ప్రభుత్వం బహిరంగంగానే దోపిడీకి పాల్పడిందని కిషన్ రెడ్డి తెలిపారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ.. ఆ తర్వాత భారీ సాగునీటి ప్రాజెక్టుల పేరుతో అంచనాలు పెంచి.. అడ్డగోలు దోపిడీకి కేసీఆర్ బాటలు వేయడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఇటు గోదావరి జలాలు, అటు కృష్ణ జలాలను అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుతో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పడి తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే.. ఉద్యమం సందర్భంగా తీసుకున్న ‘నీళ్ల’ నినాదానికి ఏం న్యాయం జరిగినట్లు అని ప్రశ్నించారు.

ఇలా నీళ్లు, నిధులు, నియామకాలకోసం, సామాజిక తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానం చేసుకున్న ఘనమైన చరిత్ర మనదని కిషన్ రెడ్డి తెలిపారు. కానీ పదేళ్లలోనే ఇవన్నీ పటాపంచలు చేస్తూ కేసీఆర్.. కేవలం కుటుంబాన్ని బంగారు మయం చేసుకుని.. మన తెలంగాణను ’బందీఖానా’గా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా, వైద్య వ్యవస్థలు కుంటుబడ్డాయి.. పరిపాలన పడకేసింది.. వేలకోట్లు దుర్వినియోగం అయినా.. ఎక్కడా ఫలితం కనిపించడం లేదని తెలిపారు. ఇదేనా మనం కోరుకున్న తెలంగాణ? దీనిపై తెలంగాణ ప్రజలు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణమిది అని అన్నారు. అసలు ఈ పదేళ్లలో రాష్ట్రంలో సంతృప్తి చెందిన వర్గం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఏమైనా అర్థం ఉందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

CM YS Jagan: కాలుష్యరహిత విద్యుత్‌ రాష్ట్రానికి మేలు చేస్తుంది: సీఎం జగన్

దళితులకు మూడెకరాలు, ముఖ్యమంత్రి పదవి అని చెప్పి కేసీఆర్ మోసం చేస్తే.. వారిని అక్కున చేర్చుకున్న మహనీయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని అన్నారు. దశాబ్దాలుగా వర్గీకరణ కోసం వారు చేస్తున్న డిమాండ్లను గుర్తించి.. ప్రధానమంత్రి హోదాలో వారి సభకు హాజరై భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి.. సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారని తెలిపారు. ఆరేడు దశాబ్దాలుగా రాజ్యాధికార కాంక్షతో ఉన్న బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు.. తెలంగాణలో తొలి బీజేపీ ముఖ్యమంత్రి వెనుకబడిన వర్గాలకు చెందినవారేనని ప్రకటించారు. ఇదంతా.. తెలంగాణ ప్రాంతంలోని వివిధ సామాజిక వర్గాల ఆకాంక్షలకు సరైన గౌరవాన్ని ఇవ్వడమే కాకుండా.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ లక్షాల్లో ఒకటైన ‘సామాజిక తెలంగాణ’ సాధన దిశగా బీజేపీకి ఉన్న కమిట్‌మెంట్‌కు నిదర్శనమన్నారు. ఇది కాకుండా.. తొమ్మిదిన్నరేండ్లలో రూ.9లక్షల కోట్లు రాష్ట్రాభివృద్ధికి ఖర్చుచేశారని కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు.