హైదరాబాద్ నగరంలో బీజేపీ నేత బీఎల్ సంతోష్ పోస్టర్ల కలకలం రేపుతున్నాయి. బీఎల్ సంతోష్ కనబడుట లేదు అంటూ ఫొటోలు హైదరాబాద్ సిటీలో వెలిశాయి. వాల్ పోస్టర్లు సిటీలోని చాలా ప్రాంతాల్లో వెలిశాయి. ఎమ్మెల్యేల కొనుగోలులో సిద్ధహస్తుడు అని గుర్తుతెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. పట్టిచ్చిన వారికి మోడీ హామీ ఇచ్చిన 15 లక్షల రూపాయలు.. బహుమానం అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు.
Also Read : Off The Record: పెద్దాపురంపై క్లారిటీ వచ్చినట్టేనా?
దీంతో బీఎల్ సంతోష్ పోస్టర్లను ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సూత్రధారి ఈయనేనని తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బీజేపీ మానిప్యులేషన్ తో విచారణ నుంచి తప్పించుకున్నాడని తెలంగాణ పబ్లిక్ మాట్లాకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో ఈ పోస్టర్లు అంటించారు. దీంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలే ఈ పని చేశారని కమలం పార్టీ నేతలు మండిపడుతున్నారు. వెంటనే అంటించిన పోస్టర్లను తొలగించాలని తెలంగాణ బీజేపీ నేతలు తెలిపారు.
Also Read : Off The Record: మునుగోడులో మళ్ళీ మొదలు
మొయినాబాద్ ఫామ్ హౌజ్ వ్యవహారంపై కర్ణాటక నేత, బీజేపీ సీనియర్ లీడర్ బీఎల్ సంతోష్ కీలకంగా వ్యవహరించినట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో అతని పేరు తెలంగాణలో మారుమోగుతుంది. ఇప్పటికే బీఎల్ సంతోష్ పై తెలంగాణలో కేసు నమోదైంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణకు రాకుండా ఆయన అప్పించుకుని తిరిగారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సీబీఐకి అప్పగించింది. కేసు సీబీఐకి అప్పగించడంతో తెలంగాణ సర్కార్ దీనిపై తెలంగాణ హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ కేసు విచారణ కొనసాగుతుంది.