NTV Telugu Site icon

BJP: బీజేపీ నాల్గో జాబితా విడుదల.. సీనియర్ నటి రాధిక ఎక్కడి నుంచంటే..!

Bjp Fou

Bjp Fou

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాల్గో జాబితాను బీజేపీ విడుదల చేసింది. 15 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఒక కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన అభ్యర్థులను బీజేపీ వెల్లడించింది.

పుదుచ్చేరీలో ఒకటి, తమిళనాడులోని 14 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. ప్రముఖ సినీనటి రాధికా శరత్‌ కుమార్‌ విరుధునగర్‌ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల ఆమె భర్త ఆర్‌.శరత్‌ కుమార్‌ తన పార్టీ ఆల్‌ ఇండియా సమతువ మక్కల్‌ కట్చిని బీజేపీలో విలీనం చేశారు. పుదుచ్చేరీ లోక్‌సభ స్థానం నుంచి నమశ్శివాయం బరిలోకి దిగుతున్నారు.

మొత్తం నాలుగు జాబితాల్లో 291 మంది అభ్యర్థులను కమలనాథులు ప్రకటించారు. తొలి జాబితాలో 195 మంది, రెండో జాబితాలో 72 మంది, మూడో జాబితాలో 9 మంది, నాల్గో జాబితాలో 15 మంది అభ్యర్థులను వెల్లడించింది. ఫస్ట్ ఫేజ్‌లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ఇక చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. చివరి విడత జూన్ 1న ముగియనుంది. ఇక జూన్ 4న ఫలితాలు విడుదలకానున్నాయి. తొలి విడతలో ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.

తమిళనాడు అభ్యర్థులు వీరే..
విరుధునగర్‌-రాధికా శరత్‌ కుమార్‌
మదురై-రామ శ్రీనివాసన్‌
చిదంబరం – పి. కాత్యాయని
తిరువళ్లూరు-పొన్‌. వి.బాలగణపతి
చెన్నై నార్త్‌-ఆర్‌.సి. పాల్‌ కనగరాజ్‌
తిరువన్నామలై-ఎ. అశ్వత్థామన్‌
నమక్కల్‌- కె.పి. రామలింగం
తిరుప్పూర్‌- ఎ.పి. మురుగనందం
పొల్లాచ్చి-కె. వసంతరాజన్‌
కరూర్‌-వి.వి. సెంథిల్‌నాథన్‌
నాగపట్టిణం – ఎస్‌జీఎం రమేశ్‌
తంజావూరు-ఎం. మురుగనందం
శివలింగ-దేవనాథన్‌ యాదవ్‌

తెన్‌కాశీ – జాన్‌ పాండియన్‌