BJP Candidates List: బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల 12వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి అభిజిత్ దాస్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఆయన సవాలు విసిరారు. దీంతో పాటు యూపీలోని రెండు స్థానాల నుంచి అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఫిరోజాబాద్ నుంచి ఠాకూర్ విశ్వజిత్ సింగ్ బరిలోకి దిగనున్నారు. ఇది కాకుండా శశాంక్ మణి త్రిపాఠికి డియోరియా స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించారు.
BJP releases its 12th list of candidates for the Lok Sabha elections.
#LokSabaElection2024 pic.twitter.com/DihIkG6caV
— ANI (@ANI) April 16, 2024