Site icon NTV Telugu

BJP: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Bjp

Bjp

ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ప్రకటించింది. తొలి జాబితాలో మధ్యప్రదేశ్‌లోని 230 స్థానాలకు గాను 39 మంది అభ్యర్థులకు బీజేపీ స్థానం కల్పించింది. అందులో ఐదుగురు మహిళల పేర్లు ఉన్నాయి. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల కోసం విడుదల చేసిన తొలి జాబితాలో ఐదుగురు మహిళలు సహా 21 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. పటాన్‌ నుంచి ఎంపీ విజయ్‌ బఘెల్‌ను రంగంలోకి దింపారు. ఇంతకుముందు పటాన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. దీంతో ఈ దఫా ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేయనున్నారు.

Woman With Gun: గన్ తో విలన్ లా హడావుడి చేసిన మహిళ… పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఎవరికి టికెట్ ఇచ్చిందంటే..
సబల్‌గఢ్‌ నుంచి సరళా విజేందర్‌ రావత్‌, సుమావలి నుంచి అటల్‌ సింగ్‌ కంసనా, గోహద్‌ నుంచి లాల్‌ సింగ్‌ ఆర్య, పిచోర్‌ నుంచి ప్రీతమ్‌ లోధి, చచోడ్‌ నుంచి ప్రియాంక మీనా బరిలోకి దిగారు. చందేరీ నుంచి జగన్నాథ్ సింగ్ రఘువంశీ, బండా నుంచి వీరేంద్ర సింగ్ లంబార్దార్, మహారాజ్‌పూర్ నుంచి కామాఖ్య ప్రతాప్ సింగ్, ఛత్తర్‌పూర్ నుంచి లలితా యాదవ్, పఠారియా నుంచి లఖన్ పటేల్‌లకు టిక్కెట్లు ఇచ్చారు. అంతే కాకుండా.. గున్నౌర్ నుండి రాజేష్ కుమార్ వర్మ, చిత్రకూట్ నుండి సురేంద్ర సింగ్ గహర్వార్, పుష్పరాజ్‌గఢ్ నుండి హీరాసింగ్ శ్యామ్, బైవారా నుండి ధీరేంద్ర సింగ్, బార్గి నుండి నీరజ్ థాకుక్ మరియు జబల్‌పూర్ తూర్పు నుండి అంచల్ సోంకర్‌లను బీజేపీ నామినేట్ చేసింది.

షాపురా నుంచి ఓంప్రకాష్ ధుర్వే, బిచియా నుంచి విజయ్ ఆనంద్ మరాఠీ, బైహార్ నుంచి భగత్ సింగ్ నేతమ్, లంజీ నుంచి రాజ్‌కుమార్ కర్రే, బర్ఘాట్ నుంచి కమల్ మాస్కోలే, గోటెగావ్ నుంచి మహేంద్ర నగేశ్, సౌసర్ నుంచి నానాభౌ మొహొద్, పాంధుర్నా నుంచి ప్రకాశ్ ఉకేలను బీజేపీ బరిలోకి దించింది. ముల్తాయ్‌ నుంచి చంద్రశేఖర్‌ దేశ్‌ముఖ్‌, భైన్‌దేఘి నుంచి మహేంద్ర సింగ్‌ చౌహాన్‌, భోపాల్‌ నార్త్‌ నుంచి అలోక్‌ శర్మ, భోపాల్‌ సెంట్రల్‌ నుంచి ధ్రువ్‌ నారాయణ్‌ సింగ్‌, సోంకాచ్‌ నుంచి రాజేశ్‌ సోంకర్‌, మహేశ్వర్‌ నుంచి రాజ్‌కుమార్‌ మియో, కాస్రావాడ్‌ నుంచి ఆత్మారామ్ పటేల్, భను అలీ రాజ్‌సింగ్ చౌహాన్‌లను పార్టీ బరిలోకి దింపింది. ఝబువా నుంచి భూరియాకు టిక్కెట్టు ఇచ్చారు. దీంతో పాటు పెట్లవాడ నుంచి నిర్మలా భూరియా, కుక్షి నుంచి జైదీప్ పటేల్, ధరంపుర నుంచి కాలు సింగ్ ఠాకూర్, రౌ నుంచి మధు వర్మ, తరానా నుంచి తారాచంద్ గోయెల్, ఘటియా నుంచి సతీష్ మాల్వియా బరిలోకి దిగారు.

Rakshasa Kavyam: జయ విజయులు కలియుగంలో పుడితే ఇక రాక్షస కావ్యమే?

ఛత్తీస్‌గఢ్‌లో ఎవరికి టికెట్ వచ్చిందంటే..
ఛత్తీస్‌గఢ్‌లోని ప్రేమ్‌నగర్ నుంచి భూలాన్ సింగ్ మరాఠీ, భట్‌గావ్ నుంచి లక్ష్మీ రాజ్‌వాడే, ప్రతాపూర్ నుంచి శకంతుల సింగ్ పోర్తే, రామానుగంజ్ నుంచి రాంవిచార్ నేతమ్, లండ్ నుంచి ప్రబోజ్ భేజ్, ఖరారియా నుంచి మహేశ్ సాహు, ధరమ్‌జాగఢ్ నుంచి హరిశ్చంద్ర రాథియాలను బీజేపీ బరిలోకి దించింది. అంతే కాకుండా కోర్బా నుండి లఖన్‌లాల్ దేవాంగన్, మార్వాహి నుండి ప్రణవ్ కుమార్ మార్పాచి, సరైపాలి నుండి సరళ కొసరియా, ఖల్లారీ నుండి అల్కా చంద్రకర్, అభన్‌పూర్ నుండి ఇందర్‌కుమార్ సాహు, రజిమ్ నుండి రోహిత్ సాహు, సిహవా నుండి శ్రవణ్ మార్కం, దౌండి సింగ్ లోహరా నుండి దేవ్‌లాల్ హల్వా ఠాకూర్, ఖైరాఘర్, ఖుజ్జీ నుంచి గీతా ఘాసి సాహు, మొహ్లా-మనుపర్ నుంచి సంజీవ్ సాహా, కాంకేర్ నుంచి ఆశారామ్ నేతమ్, బస్తర్ నుంచి మణిరామ్ కశ్యప్‌లకు టిక్కెట్లు ఇచ్చారు.

Exit mobile version