Site icon NTV Telugu

Tamil Nadu Politics: విజయ్‌ని కలిసిన బీజేపీ..! కాషాయ పార్టీ భారీ వ్యూహం ఫలిస్తుందా..?

Tn

Tn

Tamil Nadu Politics: కరూర్ తొక్కిసలాట జరిగిన కొన్ని రోజుల తర్వాత దక్షిణాది సూపర్ స్టార్ విజయ్ పార్టీని బీజేపీ సంప్రదించిందని రాజకీయ వర్గాలు తెలిపాయి. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తన అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. డీఎంకే అన్యాయంగా విజయ్‌ను లక్ష్యంగా చేసుకుందని.. విజయ్ ఒంటరి కాదని బీజేపీ సీనియర్ నాయకుడు తమిళగ వెట్రి కజగం (టీవీకే) నాయకత్వానికి తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు.. డీఎంకేను ఇరుకున పెట్టాలని బీజేపీ టీవీకేకి సూచించిందని చెబుతున్నారు. ఈ విషాదం తర్వాత తనకు మద్దతు ఇచ్చిన రాజకీయ నాయకులకు విజయ్ కృతజ్ఞతలు తెలిపినట్లు తెలుస్తోంది.

READ MORE: Story Board : ట్రంప్ ఎజెండా అమెరికాను ముంచేయడమే..?

బీజేపీతో పాటు, కాంగ్రెస్ కూడా టీవీకేను సంప్రదించింది. ద్రవిడ ప్రధాన పార్టీలు, డీఎంకే, ఎఐఎడీఎంకే ఆధిపత్యం వహించే రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేయడానికి జాతీయ పార్టీలు దీన్ని ఓ అవకాశంగా భావిస్తున్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. 2026 ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ గతంలో ప్రకటించారు. కానీ తాజా పరిణామాల నేపథ్యంలో విజయ్ వ్యూహాలను మార్చవచ్చని చర్చ జరుగుతోంది. మరోవైపు.. రాబోయే ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకతను ఎదుర్కొంటుందని బీజేపీ నాయకత్వం విశ్వసిస్తోంది. ఈ అంశంపై టీవీకేపై దృష్టి సారించి ప్రతిపక్ష ఓట్లను ఏకీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

READ MORE: Team India Squad: రోహిత్ శర్మ, విరాట్ సహా ఆస్ట్రేలియాతో తలపడేది వీళ్ళే!

ఈ వ్యూహంలో భాగంగానే.. సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట తర్వాత.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తన ప్రతినిధి బృందాన్ని కరూర్‌కు తరలించింది. మొదటి నుంచి ఈ ఘటనకు అసలు కారణం డీఎంకే అంటూ బీజేపీ ఆరోపిస్తోంది. డీఎంకే పూర్తిగా టీవీకేపై నిందలు వేస్తుండగా.. ఇతర పార్టీలు విజయ్ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నాయి. విజయ్ వాగ్ధాటి, ప్రజాదరణ కారణంగా టీవీకే ఓటర్లను ఆకట్టుకోగలదని, ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమైన శక్తిగా ఎదగగలదని బీజేపీ అంచనా వేస్తోంది. డీఎండీకే, ఎన్టీకే వంటి చిన్న పార్టీల నుంచి ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని కమలం పార్టీ భావిస్తోంది. ఎఐఎడీఎంకేతోనూ పొత్తు విచ్ఛిన్నం చేయకూడదని బీజేపీ జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. చివరకు ఏం జరుగుతోందో చూడాలి..

READ MORE: Team India Squad: రోహిత్ శర్మ, విరాట్ సహా ఆస్ట్రేలియాతో తలపడేది వీళ్ళే!

Exit mobile version