Site icon NTV Telugu

Ramchander Rao: ఎస్సైజ్ శాఖ కల్లు కాంపౌండ్ వారితో కుమ్మకైంది.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హాట్ కామెంట్స్..!

Ramachander Rao

Ramachander Rao

Ramchander Rao: సైకోట్రోపిక్ కల్లు ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఓ కల్లు కాంపౌండ్‌ లో కల్లులో సైకో ట్రోఫిక్ సబ్‌స్టెన్స్ కలపడం వల్ల అనధికారికంగా 6 మంది మృతి చెందారని, పలువురి ఆరోగ్యం విషమించిందని ఆయన తెలిపారు. రెండు సీసాల కల్లు తాగినవారిలో కిడ్నీలు దెబ్బతిన్నాయనడం ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఒకే ఆసుపత్రిలో 31 మందికి చికిత్స జరుగుతోందని, బాధితుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని రామచందర్ రావు తెలిపారు.

Read Also:Compact vs Slim Phones: కాంపాక్ట్, స్లిమ్ ఫోన్లు.. ఏది బెస్ట్? ఎందుకు..?

ఇది ఇప్పుడు కొత్తగా జరిగిన ఘటన కాదని.. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని గుర్తుచేశారు. ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎక్సైజ్ శాఖ కల్లు కాంపౌండ్‌ల యజమానులతో కుమ్మకై అయ్యిందని ఆరోపించారు. ఈ విషయంలో ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, కళ్లు కాంపౌండ్‌లపై ప్రతిరోజు తనిఖీలు చేయాలని డిమాండ్ చేశారు. ఏ రకంగా చూసినా ఈ విషప్రయోగ ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించి బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన అన్నారు.

Read Also:Bihar Elections: గుర్తింపు కార్డుల్లో ఆధార్ ఎందుకు చేర్చలేదు.. ఈసీని ప్రశ్నించిన సుప్రీం ధర్మాసనం

మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం ఇవ్వాలని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రతి బాధితుడికి రూ. 1 లక్ష పరిహారం ఇవ్వాలని ఆయన అన్నారు. ఎక్సైజ్ శాఖ లోపాలను సమీక్షించి, కల్లు కాంపౌండ్‌లపై కఠినంగా నిఘా పెట్టాలన్నారు. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలతో ఆడుకునే వ్యవస్థపై నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉందని రామచందర్ రావు స్పష్టం చేశారు.

Exit mobile version