తమిళనాడు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఈ వ్యాఖ్యలను ఉదహరిస్తూ.. డీఎంకే పార్టీ, సీఎం స్టాలిన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో విభేదాలపై సూపర్ స్టార్ కుండబద్ధలు గొట్టారన్నారు. అసలేం జరిగిందంటే..
READ MORE: Minister Atchannaidu: ప్రజలు మెచ్చే నాయకుడిగా పనిచేసి చూపిస్తా..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధిపై రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడారు. కరుణానిధి మరణానంతరం స్టాలిన్ పార్టీని చాతుర్యంతో ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. ఒక ఉపాధ్యాయుడు కొత్త విద్యార్థిని దారిలో పెట్టడం పెద్ద విషయం ఏమి కాదు. కానీ సీనిర్ విద్యార్థులను(సీనియర్ నాయకులు) దారిలో పెట్టడం కష్టంగా మారుతుంది. ఆ పాత విద్యార్థులు మామూలు వారు కాదు కదా.. మంచి ఫలితాలు సాధించిన వారు. దురై మురుగన్ వంటి పెద్దలున్న ఈ పార్టీని స్టాలిన్ బాగా సమన్వయం చేస్తున్నారు. హ్యాట్సాప్ స్టాలిన్ గారు అని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , అన్నామలై స్టాలిన్ పై విరుచుకుపడ్డారు.
READ MORE:Mathu Vadalara 2: ‘మత్తు వదలరా 2’ రిలీజ్ డేట్ ఫిక్స్
డీఎంకేలో అసంతృప్తికి రజినీ కాంత్ చేసిన వ్యాఖ్యలు ఉదాహరణ అని అన్నామలై అభిప్రాయపడ్డారు. ‘‘సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రసంగం స్టాలిన్‌కు ఒక హెచ్చరికగా నాకు అనిపిస్తోంది. దురై మురుగన్, ఈవీ వేలు వంటి వారు ఉండగా.. ఉదయనిధి స్టాలిన్‌కు బాధ్యతలు అప్పగిస్తే, పార్టీలో తిరుగుబాటు వస్తుందని రజిని కాంత్ వ్యాఖ్యల సారాంశంగా నాకు అనుపిస్తుంది. ఎవరినీ బాధించకుండా తన శైలిలో వాస్తవాలు చెప్పారు సుపర్ స్టార్’’ అని స్టాలిన్ పై విమర్శలు గుప్పించారు. కాగా.. ఉదయనిధి స్టాలిన్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. డీఎంకే వారసత్వాన్ని స్టాలిన్.. తన కుమారుడు ఉదయనిధికి కట్టేబెట్టేలా అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో అధికారాన్ని ఆశిస్తున్న డీఎంకేలోని సీనియర్ నేతలను ఉద్దేశించి రజనీ మాట్లాడినట్టు చర్చనడుస్తోంది.