Presidential Poll: రాష్ట్రపతి ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ.. ఏకగ్రీవమా, ఎన్నికా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో దేశంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలన్న విపక్షాల ప్రయత్నాలు కొలిక్కి రాకుండానే బీజేపీ ఏకగ్రీవ రాగం ఎత్తుకుని పరిస్థితిని ఆసక్తికరంగా మార్చింది. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీలో దాదాపుగా 49 శాతం ఓట్లున్న బీజేపీకి ఒకటీ అరా పార్టీల మద్దతుతో తన అభ్యర్థిని గెలిపించుకోవడం సునాయసమని భావిస్తున్నారు. కానీ ఆజాదీ కా అమృతోత్సవ్ నేపథ్యంలో రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకు విపక్షాలనూ ఒప్పించేందుకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, బీజేపీ చీఫ్ నడ్డా రంగంలోకి దిగినా అన్ని పార్టీలూ ఏకతాటిపైకి తెచ్చే అవకాశాలు అంతంతే. మరోవైపు అభ్యర్థి ఎంపిక కోసమంటూ తృణమూల్ అధినేత్రి మమత ఏర్పాటు చేసిన విపక్షాల భేటీకి టీఆర్‌ఎస్, ఆప్, బీజేడీ వంటి పార్టీలు డుమ్మా కొట్టడంతో అస్పష్టత మరింత పెరిగింది.
అందుకే బీజేపీ ఇప్పటికే తన అభ్యర్థి ఎంపిక కసరత్తును ముమ్మరం చేసింది. ఈసారి ముస్లింకు అవకాశమిస్తుందన్న అంచనాలున్నాయి. గత ఎన్నికలప్పుడు రాష్టపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ పేరును బీజేపీ చివరి నిమిషం దాకా గోప్యంగా ఉంచింది. రాష్ట్రపతి రేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కేరళ గవర్నర్ అరిఫ్ మహమ్మద్ ఖాన్. యూపీలోని బులంద్‌షహార్‌కు చెందిన ఈయన విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్, జనతాదళ్, బీఎస్పీ, లెఫ్ట్ పార్టీల్లో పని చేశారు. 2004లో బీజేపీలో చేరారు. మహ్మద్ ప్రవక్తపై బీజేపీ సస్పెండెడ్ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా అగ్గి రాజేసిన నేపథ్యంలో ముస్లింకు అత్యున్నత పదవిని కాషాయ పార్టీ కట్టబెట్టవచ్చన్న అభిప్రాయం బలంగా ఉంది.
Also Read
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
- Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
- MK Stalin: తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికపై రాజకీయ ఉత్కంఠ.. స్టాలిన్ బరిలోకి దిగుతారా? డీఎంకేలో పెరుగుతున్న డిమాండ్
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
మరో వైపు ఆరు రాష్ట్రాల్లో ఆదివాసీల ఓట్లు గణనీయంగా ఉన్నందున ఈసారి ఆదివాసీలకు అవకాశమివ్వాలని ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు ప్రచారముంది. తొలి ఛాయిస్‌గా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేరు వినిపిస్తోంది. మహిళకు అవకాశం ఇస్తే రానున్న పలు ఎన్నికల్లో మహిళల ఓట్లను మరింతగా రాబట్టవచ్చన్నది బీజేపీ వ్యూహమంటున్నారు. కాంగ్రెస్‌కు షాకిచ్చేలా ఆ పార్టీ అసంతృప్త నేత గులాం నబీ ఆజాద్‌ను బీజేపీ రంగంలోకి దించే ఛాన్స్ లేకపోలేదంటున్నారు. ఆజాద్ అనుచరులు ఇప్పటికే భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు.
విపక్షాల తరఫున బరిలో దిగేందుకు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నిరాకరించడంతో మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా పేర్లను మమత తెరపైకి తెచ్చారు. స్వాతంత్య్ర అమృతోత్సవాల వేళ గాంధీ మనవడిని దింపి బీజేపీని ఇరకాటంలో పెట్టవచ్చన్న ఆలోచన విపక్షాల్లో ఉంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో బీజేపీ హవాకు అడ్డుకట్ట వెయ్యాలంటే ఆ ప్రాంతానికి చెందిన ఫరూక్‌ను బరిలో దించే ఆలోచనా ఉంది. బీజేపీ ముస్లింకు అవకాశమిస్తే పోటీగా ఫరూక్‌ను దించాలని భావిస్తున్నాయి. బీజేపీ నేత ముక్తార్ అబ్సాస్ నక్వీ, ఛత్తీస్‌గఢ్ గవర్నర్ అనుసూయ ఊకే, తెలంగాణ గవర్నర్ తమిళిసై, కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్ర మహాజన్ తదితరుల పేర్లు కూడా చక్కర్లు కొడున్నాయి.
తాజావార్తలు
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!