NTV Telugu Site icon

J P Nadda: “వాహ్..దీదీ.. రేపిస్టులకు సాయం చేయడం గౌరవం?.. మహిళల భద్రతపై ప్రశ్నించడం నేరమా?”

Jp Nadda

Jp Nadda

కోల్ కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసుపై దేశ వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్న వేళ కోల్ కతా మాంత్రం అట్టుడికి పోతుంది. విద్యార్థులు మరోసారి పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. విద్యార్థులు ఇప్పటికే ‘నబన్న అభియాన్’ కింద.. అంటే సెక్రటేరియట్ ముట్టడించారు. దీన్ని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది. హౌరా బ్రిడ్జికి సీలు వేసింది. బ్రిడ్జిపై ఇనుప గోడను నిర్మించారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

READ MORE: Allu vs Mega : అల్లు అర్జున్ నువ్ పుడింగివా? మీ నాన్ననే గెలిపించుకోలేక పోయావ్.. జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ బెంగాల్‌లో మహిళల భద్రత కోసం దీదీ మాట్లాడడం కూడా నేరమే: జేపీ నడ్డా
ఈ ఘటనపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా స్పందించారు. ఈ నిరసన కవాతు సందర్భంగా.. విద్యార్థులపై పోలీసుల చర్యలను ఆయన తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా.. ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. దీదీ.. పశ్చిమ బెంగాల్‌లో, రేపిస్టులు, నేరస్థులకు సహాయం చేయడం గర్వకారణం. కానీ.. మహిళల భద్రత కోసం మాట్లాడటం, ప్రశ్నించడం నేరమా? అని ప్రశ్నించారు. మరోవైపు హత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యులు.. ఈ నిరసనలకు దూరంగా ఉన్నారు. ఛాత్ర సమాజ్‌ తో తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించిన జూనియర్‌ వైద్యులు ప్రకటించారు. బుధవారం కోల్‌కతాలో ర్యాలీకి పిలుపునిచ్చారు. మరోవైపు, ఈ విద్యార్థి సంఘం ఆందోళనలకు భాజపా మాత్రమే మద్దతు ఇచ్చింది.