NTV Telugu Site icon

BJP Muralidhar Rao : రాహుల్‌ది జోడో యాత్ర కాదు తోడో యాత్ర

Muralidhar Rao

Muralidhar Rao

రాహుల్‌ది జోడో యాత్ర కాదు తోడో యాత్ర అని విమర్శలు గుప్పించారు బీజేపీ నేత మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఫిల్మ్ థియేటర్ లలో రిలీజ్ కు రెడీ కాలేదని, హోటల్ లకు, వర్చువల్ మీటింగ్ లకే పరిమితం అయిందన్నారు. కూటమి ఇప్పటి వరకు ఒక్క బహిరంగ సభ పెట్టలేదన్నారు మురళీధర్‌ రావు. అంతేకాకుండా.. ఏ అంశం లోనూ వారు ఏకాభిప్రాయం కి రాలేదని, రాహుల్ పశ్చిమ బెంగాల్ లోకి ఎంటర్ అయ్యే నాటికి మమత బెనర్జీ పొత్తు లేదని స్పష్టం చేసిందన్నారు. ఆమె కాంగ్రెస్ నేతలకు రెస్పాన్స్ కూడా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూటమి ఫెయిల్ అయింది… కూటమి లేదని, రాహుల్ గాంధీ నాయకత్వం లో కూటమి సాధ్యం కాదన్నారు మురళీధర్‌ రావు. జనవరి ఒకటి వరకు సీట్ల షేరింగ్ ప్రకటిస్తామని చెప్పారు .. ఇప్పటి వరకు తేల్చలేదన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.

 

తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ స్వీకరించిందని, అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్, రేవంత్ రెడ్డి అవినీతి విచారణ లో ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. వంద మీటర్ లు పాతేస్త అనేది ఎవరు నమ్మరు… ఏమీ చేస్తున్నారో ప్రజలు చూస్తున్నారని, కాళేశ్వరం, ORR, ధరణి స్కాం ల విషయం లో ఈ ప్రభుత్వం ముందుకు పోవడం లేదు… ఏదో రహస్యం దీని వెనుక ఉందని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత తో ఈ ప్రభుత్వం కుమ్మక్కు అయిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. తిట్లు, విమర్శలు ఒక నాటకమని, సెటిల్మెంట్ లు చేసుకుంటున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ను పావు గా కాంగ్రెస్ వాడుకుంటుందని, ఎల్లుండితో సర్పంచ్ ల కాల పరిమితి ముగుస్తుందని, ఈ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణ కు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సర్పంచ్ లకు బిల్లులు ఇంకా బకాయి లు ఉన్నాయన్నారు. స్పెషల్ ఆఫీసర్స్ తో గ్రామ పంచాయతీలు నడిపిస్తే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్టేనని ఆయన అభివర్ణించారు. ఎన్నికలు నిర్వహించే వరకు ప్రస్తుత సర్పంచ్ లను కొనసాగించండని ఆయన అన్నారు.